భార్య బాధితులు ఇంతమందా ..? పురుష కమిషన్ కావాల్సిందేనా ..?

సమాజంలో భార్యా బాధితులు కూడా వున్నారా? వారు తమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించారా? అంటే వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది నిజం.సమాజంలో నైతిక మద్దతు కూడా కూడగట్టుకునేందుకు బాధితులందరూ కలిపి ఇటీవల సంఘాలుగా ఏర్పడుతున్నారు.

 Woman Victims Demanding Mens Commission-TeluguStop.com

ఈ దేశంలో తాము పౌరులమేనని, తమకు హక్కులు కావాలంటూ నిలదీస్తున్నారు.ఇటువంటి సంఘాలు మన రాష్ట్రంలోనే పదుల సంఖ్యలో ప్రతి జిల్లాలో వెలుస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా ఎస్‌ఐఎఫ్‌ పేరుతో పదివేల మందితో వీరికి సలహాలు, సహాయాలు అందించేందుకు బ్రాంచ్‌లు కూడా ఏర్పాటు చేసుకున్నారు.

10వేలమందితో జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన.

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఈనెల 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సంఘాలను కూడగట్టి సుమారు పదివేల మందితో రెండు రోజుల పాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

మహిళా కమిషన్‌ కాకుండా పురుష కమిషన్ కోసం డిమాండ్ :

మహిళా కమిషన్‌ కాకుండా పురుష కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని ప్రధానంగా వీరు డిమాండ్‌ చేశారు.ఈ సమా వేశానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు హరిహరన్‌, అన్షుత్‌వర్మలు వచ్చి మద్దతు తెలపడం కొసమెరుపు.

సోషల్‌ మీడియాలో మద్దతు

భార్యాభాధితుల సంఘాలు సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారు.దీనికి రాష్ట్రవ్యా ప్తంగా అనేక సంఘాలు ఏర్పాటు కావడంతో అందరూ కలిసి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకున్నారు.వీరికి లభిస్తున్న మద్దతు ఈ సంఘాలకు దానిలోని సభ్యులకు మద్దతుగా ఉంటుంది.ఈ సంఘాల ఏర్పాటు ఏ స్థాయికి వెళ్ళిదంటే మండలాలు, జిల్లాల వారీగానే కాకుండా హైదరాబాద్‌ కేంద్రంగా సాఫ్ట్‌వేర్‌ భార్యా బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసి ఇటీవల దాని ప్రథమ వార్షికోత్స వాన్ని నిర్వహించారు.300 మంది సమావేశానికి హాజరయ్యారు.

విజయవాడలో భార్యా బాధితుల సంఘం.

ఈనెల 1వ తేదీన విజయవాడలో ఏపీ భార్యా బాధితుల సంఘం సమావేశం జరిగింది.ఈ సమా వేశంలో వివిధ జిల్లాల నుంచి వందల సంఖ్యలో బాధితులు పాల్గొన్నారు.తామంతా సంఘటితంగా పోరాడి పురుషుల హక్కులు సాధించే వరకు పోరాటాన్ని కొన సాగించాలని నిర్ణయించుకున్నారు.సమావేశంలో ప్రధా నంగా వారుఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు.

భార్యా బాధితుల సంఘాల డిమాండ్స్ .

498 ఎ సెక్షన్‌ను పునఃసమీక్షించాలి.దీని ప్రకారం కేసు నమోదు చేసే ముందే పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా అరెస్టులకు వెళ్ళకూడదు.

విచారణను ఎమ్మార్వో లేదా ఆర్డీవోల సమక్షంలో నిర్వహించాలి.కేసు న మోదు అయినా ఏడాది లోపు విడాకులు మంజూరు చేసేలా చట్టం తేవాలి.

ఎంసీ, డీవీసీ సెక్షన్లను పూర్తిగా చట్టంలో నుంచి తొలగించి, కోర్టులో ఉన్న పెండింగ్‌లో ఉన్న కేసులపై మరలా కేసులు పెట్టకుండా చూడాలి.ఈ సంఘాల్లో చేరుతున్న వారిలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులే ఉంటున్నారు.

వారిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతస్థాయి డాక్టర్లు, నాయకులు, మంత్రులు ఉన్నారు.వీరు ఇటీవలఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube