బతుకు పోరాటం: వేడి నూనెలో చేయి పెట్టి..?!  

Woman Dips Hand in Hot Oil to Fry Food, Dipping Hand, Hot oil, Bajji Corner, Viral Video, Social media - Telugu Bajji Corner, Dipping Hand, Hands, Hot Oil, Oil, Social Media, Viral Video, Woman Dips Hand In Hot Oil To Fry Food

ఇది వరకు దేవుడు సినిమాలలో స్వామి వారి మహత్యం చూపించే సమయంలో అన్నంలో చేతిని పెట్టి వేడి వేడి నీటిలో అన్నాన్ని చేయడం గమనించే ఉంటాం.అలా చేసిన దేవుని మహిమలు చూసి భక్తులంతా వారిని అవతార పురుషుడని వారికి మహిమలు కలవని, అవతార పురుషులని వివిధ రకాలుగా వారిని కీర్తిస్తూ ఉంటారు.

TeluguStop.com - Woman Using Hands Fry Food Hot Oil

అయితే తాజాగా ఓ మహిళ కూడా ఇలాగే వేడి వేడి నీటిలో కాకుండా ఏకంగా సలసల కాగే నూనెలో తన చేతులను పెడుతుంది.అయితే ఇదేదో కేవలం తనకున్న మహిమలను చూపడానికో లేకపోతే తన టాలెంట్ చూపించుకోవడానికో మరీ ముఖ్యంగా గిన్నిస్ రికార్డుల కోసం కాకుండా కేవలం బతుకు తెరువు కోసం చేయాల్సిన పని ఉంది.

ఆవిడ తనబతుకు తెరువు కోసం రోడ్డు పక్క బజ్జీల బండి ని పెట్టుకుని అందులో పిండివంటలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంది.ఆవిడ సలసల కాగే నూనెలో బజ్జీలు వేస్తూ గరిట ఉపయోగించకుండానే కేవలం చేతులు పెట్టి వాటిని తిప్పుతూ ఉంది.

TeluguStop.com - బతుకు పోరాటం: వేడి నూనెలో చేయి పెట్టి..-General-Telugu-Telugu Tollywood Photo Image

బాగా మరుగుతున్న నూనెలో ఆవిడ ముందు మిర్చీలు వేసి.ఆ తర్వాత గరిట లేకుండానే వాటిని తన చేతి వేళ్ళతో అటు ఇటు తిప్పేస్తుంది.ఇకపోతే అటుగా బజ్జీలు తిననికి వచ్చిన ఓ నెటిజన్ ఆవిడ చేస్తున్న పనిని చూసి వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ఓ పెద్దావిడ పెద్ద కడాయిలో ఉన్న నూనెలో మిర్చీలు వేయడంతో పాటు వాటిని చేతితో తిప్పడం గమనించవచ్చు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్స్ వారి స్టైల్ లో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఆమె చేసే పనికి హాట్సాఫ్ అని చెబుతుండగా మరి కొందరు ఆవిడ ముందర గరిటలు కూడా ఓడిపోయే అని కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే మన మీద ఓ చిన్న నూనె చుక్క పడితే చాలు ఏదో జరిగిపోయిందన్న పని చేస్తాం.

అలాంటి వారు ఈ వీడియో చూసి ఆమె ధైర్యాన్ని నేర్చుకోవాలని కామెంట్ చేశారు.

#WomanDips #Social Media #Viral Video #Hot Oil #Bajji Corner

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Using Hands Fry Food Hot Oil Related Telugu News,Photos/Pics,Images..