సాలీడు కుట్టడంతో సర్జరీ చేసిన డాక్టర్స్.. తృటిలో తప్పిన ప్రమాదం..!

మాములుగా మనం పాము కరిస్తే ప్రాణాపాయ స్థితికి వెళ్లారని వింటూ ఉంటాం.అలాగే తేలు విషం చాలా ప్రమాదం అని కూడా మనకు తెలుసు.

 Australian Woman Undergoes Surgery After Venomous Spider Bites Her In Sleep,woma-TeluguStop.com

అయితే సాలీడు పురుగు కుట్టి ప్రాణాపాయ స్థితికి చేరుకుందంటే ఎవరైనా నమ్ముతారా.ఈ విషయం ఎవ్వరు నమ్మిన నమ్మక పోయిన ఇది మాత్రం నిజం.

ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది.

ఒక యువతికి సాలీడు పురుగు కుట్టి తీవ్రమైన నొప్పి రావడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లగా సర్జరీ చేసి మరి ఆమెను కాపాడారు.అసలు ఏమి జరిగిందంటే.ఒక 18 ఏళ్ల యువతీ హాలిడేస్ ఎంజాయ్ చేయడం కోసం వెల్ఫ్ వెల్లిగా అక్కడ తన స్నేహితురాలితో కలిసి తమ కార్వాన్ లో పడుకున్నారు.

రాత్రి పడుకుని తెల్లవారాక చూసుకుంటే ఆమె చేయి బాగా వాచి నొప్పి రావడంతో ఆమె బాగా బయపడింది.

చుట్టూ చేసుకోగా ఆమె పక్కన పెద్ద సాలీడు పురుగు కనిపించింది.

దాంతో ఆమెకు ఇంకా భయం వేసింది.వెంటనే హాస్పిటల్ కు వెళ్లారు.

Telugu Australia, Spider Bits, Spider-Latest News - Telugu

ఎంత వైద్యం చేసిన ఆమె పరిస్థితి మెరుగు పడక పోవడంతో చివరకు సర్జరీ చేసి మరి ఆమెను ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు.వైద్యం అనంతరం మెల్లగా కోలుకున్న తర్వాత ఆమె ఈ విషయంపై మాట్లాడారు.

కార్వాన్ లో పడుకున్న నేను ఉదయం లేచే సరికి నొప్పితో బాధపడుతూ ఉన్నాను.న పక్కనే పెద్ద సాలీడు పురుగును చూసి బయటకు పరుగు పెట్టాను.అది కుట్టిన దగ్గర ఎర్రగా కమిలిపోయి వచ్చింది.ఆ నొప్పి తట్టుకోలేక హాస్పిటల్ లో చేరాను.

దాంతో వైద్యులు సర్జరీ చేయాలనీ చెయ్యకపోతే సెప్సిస్ అవుతుందని తెలుపడంతో సర్జరీ చేయించుకున్నాను అని ఆమె తెలిపారు.మొత్తానికి సాలీడు కుట్టిన కూడా ప్రమాదమనే విషయం తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube