ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆ ఆపరేషన్‌ చేయించుకున్నాడు... కాని ఆమె మాత్రం పిచ్చోడంది, కన్నీటి యదార్థ గాథ  

Woman Undergoes Gender Change Operation For Girlfriend -

వారిద్దరు అమ్మాయిలే, వారి స్నేహం అందరి స్నేహం మాదిరిగానే మామూలు స్నేహం కాదు.అబ్బాయిల్లో స్నేహం ప్రాణం ఇచ్చే వరకు ఉంటుంది.

Woman Undergoes Gender Change Operation For Girlfriend

కాని అమ్మాయిల్లో స్నేహం ఎక్కువగా ఉండదు.కాని వారిద్దరు మాత్రం ఒకరంటే ఒకరు ప్రాణం ఇచ్చుకునేలా స్నేహించుకున్నారు.

వీరిద్దరు స్నేహితులు అనేకంటే ప్రేమించుకున్నారు అంటే ఉత్తమం.ఎందుకంటే వీరిద్దరు ఒకరిని విడిచి పెట్టి ఒకరు కనీసం ఒక్కరోజైనా ఉండలేక పోయేవారు.

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కోసం ఆ ఆపరేషన్‌ చేయించుకున్నాడు… కాని ఆమె మాత్రం పిచ్చోడంది, కన్నీటి యదార్థ గాథ-General-Telugu-Telugu Tollywood Photo Image

అంతటి ప్రేమ ఇద్దరి మద్య ఏర్పడినది.ఇద్దరు అమ్మాయిల మద్య ఉండే ప్రేమ కేవలం వారి వారి పెళ్లిల్లు అయ్యే వరకే ఉంటుంది.కాని వారి ప్రేమ అలా కాకూడదు అని ఒక అమ్మాయి ఎవరు చేయని సాహసం చేసింది, కాని మరో అమ్మాయి మాత్రం సాహసం చేసిన అమ్మాయిని పిచ్చిది అనేసింది.దాంతో సాహసం చేసిన అమ్మాయి కన్నీరు మున్నీరు అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కేరళ రాష్ట్రం దేవభూమికి చెందిన అర్చన మరియు అన్వేషితలు మంచి స్నేహితులు.వీరి స్నేహంను చూసిన కొందరు ప్రేయసి ప్రియుడులా తెగ తిరిగేస్తున్నారుగా అనుకునేవారు.వారు మొదట తమ స్నేహంను చాలా లైట్‌గానే అనుకున్నా కాలం గడుస్తున్నా కొద్ది వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి ఏర్పడినది.దాంతో వారిద్దరు జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఇద్దరు ఆడవారు అవ్వడం వల్ల అది సాధ్యం కాదని వారికి తెలుసు.ఒకవేళ మొండిగా ఉండాలనుకున్నా కుటుంబ పెద్దలు ఒప్పుకోరు.

అందుకే ఆ స్నేహితుల్లో ఒక అమ్మాయి అయిన అర్చన లింగ మార్పిడికి సిద్దం అయ్యింది.

గత ఏడాది అక్టోబర్‌లో చెన్నైలో దాదాపు మూడున్నర లక్షలు ఖర్చు చేసి లింగమార్పిడి ఆపరేషన్‌ చేయించుకుంది.

లింగ మార్పిడి తర్వాత అర్చన కాస్త దీపు రాజ్‌ గా పేరు మార్చుకున్నాడు.పూర్తిగా కుర్రాడులా మారిపోయిన అర్చన ఉరఫ్‌ దీపు రాజ్‌ తన ప్రియమైన అన్వేషిత వద్దకు చాలా ఉత్సాహంగా వెళ్లాడు.

ఇప్పుడు మన పెళ్లికి ఎలాంటి అడ్డు లేదు, పెళ్లి చేసుకుందాం అంటూ ప్రపోజల్‌ పెట్టాడు.కాని అన్వేషిత మాత్రం మొహం చాటేసింది.పెళ్లికి ఆసక్తి చూపలేదు.పైగా తనకు పెళ్లి కుదిరిందని పెద్ద బండరాయి నెత్తిన వేసినంత పని చేసేలా చెప్పింది.

అన్వేషిత మారిపోవడంతో దీపుకు ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరు అయ్యాడు.ఎలాగైనా ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు.కాని అన్వేషిత మాత్రం ఒప్పుకోలేదు.దాంతో దీపు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పాడు.అన్వేషితను పిలిచి ఎంక్వౌరీ చేసిన పోలీసులతో దీపు మతిస్థిమితం కోల్పోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేసింది.

మా ఇద్దరి మద్య పెళ్లి చేసుకోవాలనుకునేంత ప్రేమ లేదని, తనకు తాను ఊహించేసుకుని ఆపరేషన్‌ చేయించుకుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అన్వేషిత మాటలకు దీపు గుండెలు పలిగినంత పనైంది.

ప్రేమించి, జీవితాన్ని నాశనం చేసుకుని మరీ ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న దీపు దీనగాథ పోలీసులకు కూడా కన్నీరు తెప్పించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Undergoes Gender Change Operation For Girlfriend- Related....