భూకంపం తో ప్రాణాల మీదకు వస్తుంటే ఆమె చేసిన పనికి నెటిజన్ల ఫైర్  

Woman Tries Saving Her Phone From Getting Wet In Pool-

ఇటీవల అగ్రరాజ్యం అమెరికా ను భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే.గత 20 ఏళ్ల లో వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఇది ఒకటి అని నిపుణులు కూడా తెలిపారు.అయితే అలాంటి భయంకరమైన భూకంపం లో ఒక ఫన్నీ సంఘటన అనాలో లేదా మరేదైనా అనాలో తెలియదు కానీ, ఒక సంఘటన మాత్రం జరిగింది.దెబ్రా బ్రూగల్ అనే ఒక మహిళ తన ఇంటిలోనుంచి స్విమ్మింగ్ పూల్ కోసం లాన్ మీద నుంచి వస్తుండగా, ఉన్నట్టుండి భూకంపం మొదలైంది.

Woman Tries Saving Her Phone From Getting Wet In Pool--Woman Tries Saving Her Phone From Getting Wet In Pool-

గత శనివారం వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కెల్ పై 7.1 గా నమోదైంది కూడా.అంత తీవ్రతతో వచ్చిన భూకంపం కావడంతో పూల్ లోని వాటర్ మొత్తం ఎదో సముద్రంలో నుంచి వచ్చిన అలల మాదిరిగా బయటకి ఎగసి పడుతున్నాయి.ఈ క్రమంలో అటుగా వస్తున్న దెబ్రా కింద పడిపోయింది.అయితే ఎలాగొలాగో అక్కడ నుంచి తన ప్రాణాలు కాపాడుకోవాల్సిన ఆమె ఆ సమయంలో తన ప్రాణాల కంటే కూడా ఫోన్ ను ఆ భూకంపం నుంచి కాపాడాలన్న తాపత్రయం ఎక్కువగా కనిపించింది.

Woman Tries Saving Her Phone From Getting Wet In Pool--Woman Tries Saving Her Phone From Getting Wet In Pool-

ఆమె పడిపోయిన అనంతరం ఫోన్ నీటిలో తడవకుండా కాపాడుతూ తన భర్తకు టెక్స్ట్ మెస్సేజ్ చేస్తూ పెద్దగా అరిచింది.

దీనితో ఎలాగో ఆ అరుపులు విన్నాడో లేక టెక్స్ట్ మెస్సేజ్ చూశాడో తెలియదు కానీ వెంటనే రెండు నిమిషాల్లో అక్కడకి చేరుకొని ముందుగా ఆమె ఫోన్ ని ఆతరువాత ఆమెను కాపాడి ఇంటిలోకి తీసుకొని వెళ్ళాడు.అయితే ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ లో రికార్డ్ కావడం అనంతరం సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది.

ఇక అంతే నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతూ దెబ్రా ఒక్క రేంజ్ లో ఆడుకుంటున్నారు.నీకు ప్రాణం కంటే ఫోన్ ముఖ్యమా అంటూ ఆమెకు చురకలు అంటిసున్నారు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో దాదాపు మూడు లక్షల మందికి పైగా ఈ వీడియో ని చూశారట.