హెల్మెట్ లేకుండా ప్రయాణించడమే కాదు.... అతి అందం కూడా తప్పేనట  

Woman Ticketed By Traffic Police For Being Too Pretty-

ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఫైన్ లు విధించడం కామన్.ఎందుకంటే బైక్ పై వెళుతున్నప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం,అలానే కారు లో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోకపోవడం,తాగి డ్రైవ్ చేయడం ఇలా పలు కారణాలు ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించినట్లు లెక్క.ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ లు విధించడం సహజం...

Woman Ticketed By Traffic Police For Being Too Pretty--Woman Ticketed By Traffic Police For Being Too Pretty-

కానీ అందంగా ఉండడం కూడా ట్రాఫిక్ ఆంక్షలకు విరుద్ధం అని తాజాగా ఒక ఘటన ద్వారా తెలిసింది.నిజంగా వినడానికి కొంచం వింతగా ఉన్నా ఈ ఘటన ఉరుగ్వే లో చోటుచేసుకుంది.గత నెలలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.

ఉరుగ్వే లో ఒక యువతి బైక్ పై వెళుతుండగా అడ్డగించిన ట్రాఫిక్ పోలీస్ ఆమె అందాన్ని చూసి ఫిదా అయిపోయాడట.అంతే ఇంకేముంది చలానా బుక్ తీసి రోడ్డుపై అతి అందం (excessive beauty on public roads) అని ఫైన్ వేశాడు.అంతేకాకుండా అబ్జార్వేషన్ సెక్షన్ లో ఐ లవ్ యూ అంటూ కూడారాశాడు.

Woman Ticketed By Traffic Police For Being Too Pretty--Woman Ticketed By Traffic Police For Being Too Pretty-

అయితే ఈ చలానా ను ఆ యువతి సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది.ఆ పోస్ట్ చూడగానే పలువురు లైక్ లు,కామెంట్లు పెడుతూ ఏకిపారేస్తున్నారు.కొందరు అతడి అధికారాన్ని దుర్వినియోగం చేశాడని అభిప్రాయపడుతుంటే,మరికొందరు ఏమో అతడి ధైర్యానికి ఫిదా అవుతున్నారు.నెటిజన్లు మాట పక్కన పెడితే ఉన్నతాధికారులు మాత్రం అతడి చర్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు.అధికార పత్రాన్ని అనధికార అవసరాలకు వాడుకున్నాడని అన్నారు...

ఈ ఘటనలో ఆ పోలీసు దోషి అని తేలితే.సస్పెండ్, డిమోషన్ లేదా ట్రాఫిక్ పోలీస్ శాఖ నుంచి తీసేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.