సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టిన మహిళ.. చివరకు?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరుగుతోంది.అబ్బాయిలతో పోల్చి చూస్తే అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తున్నారు.

 Woman Techies Photos Circulated On Facebook Whatsapp Dating Sites, Dating Sites,-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలే కొన్ని సందర్భాల్లో యువతులు, మహిళలకు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి.తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మహిళ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఫోటోల వల్ల ఇబ్బందులు పడుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు చెందిన ఒక మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పని చేసేది.ఒకరోజు ఆమె సోషల్ మీడియా ఖాతాలలో కొందరు వ్యక్తులు తన ఫోటోలను పోర్న్ సైట్లలో ఉపయోగిస్తున్నట్టు గుర్తించింది.కొందరు ఆమె ఫోటోలను ఎరగా చూపి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసి ఖంగు తింది.40 సంవత్సరాల వయస్సులో ఇద్దరు పిల్లల తల్లి అయిన తన ఫోటోలను దుర్వినియోగం చేయడంతో ఆ మహిళ కృంగిపోయింది.

ఈ విషయం తన స్నేహితునికి చెప్పి అతనిని సహాయం చేయాలని కోరింది.ఆ వ్యక్తి విచారణ చేయగా అవతలి వ్యక్తులు ఆమె ఫోటోలతో అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారని.

వాట్సాప్ ద్వారా ఈ తతంగం నడుపుతున్నారని తేలింది.బాధిత మహిళ అవతలి వ్యక్తుల వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించినా ఆమె వల్ల కాలేదు.

తనలా ఎంతో మంది అమాయక యువతులు, మహిళల ఫోటోలు సోషల్ మీడియాలో దుర్వినియోగం అవుతున్నట్టు మహిళ గుర్తించింది.

ఆ మహిళ చివరకు నోయిడా సెక్టార్ 49 పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి ఫోటోల దుర్వినియోగం గురించి ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఆమె ఫిర్యాదు చేసిన సైట్లను బ్లాక్ చేయించడంతో పాటు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు.పోలీసులు సోషల్ మీడియాలో అపరిచితులు ఫోటోలను యాక్సెస్ చేయలేని విధంగా సెట్టింగ్స్ మార్చుకోవాలని యువతులు, మహిళలకు సూచిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube