దేవుడా... ఏకంగా 7 కిలోల జుట్టు న‌మిలి మింగిన మ‌హిళ...‌!

అన్నం తింటున్నప్పుడు ప్లేట్ లో ఒక వెంట్రుక కనిపించినా తీసి పడేస్తాం.తింటున్నప్పుడు అనుకోకుండా నోట్లోకి వెళ్లినా నోట్లో నుంచి తీసేస్తాం.

 Doctors Removed 7kgs Hair Clup From Woman Body, Hair, Girl Ate Hair, Doctors, Jh-TeluguStop.com

వెంట్రుకలను తింటే ఆరోగ్యానికి మంచిది కాదని అందరికి తెలుసు.కానీ ఓ అమ్మాయి ఏకంగా 7 కిలోల జట్టును నమిలి మింగింది.

నోట్లో వెంట్రుకలు పెట్టుకుని అలవాటుగా మారి వ్యసనంలా తయారైంది.చివరకు ఆమె ప్రాణాలకే ముప్పుగా మారింది.

ఓ అమ్మాయి ఏడు కిలోల వెంట్రుకను నమిలిమింగిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.బోకారో జిల్లాకు చెందిన స్వీటీ కుమారి (19)కు చిన్నప్పటి నుంచి నోట్లో జుట్టును పెట్టుకోవడం అలవాటు.

చిన్నప్పుడు ఎవరికైనా నోట్లో వేలు పెట్టుకోవడం చూసి ఉంటారు కానీ, వెంట్రుకలు పెట్టుకోవడం చాలా తక్కువగా మందిని చూసి ఉంటారు.అయితే స్వీటీ కుమారికి ఆకలి వేసిన ప్రతి సారి ఆమె తన జుట్టు వెంట్రుకలను నోట్లో వేసుకుని తన దంతాలతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకుని తినేది.

ఇలా ఆమె ఏకంగా 7 కిలోల వరకు వెంట్రుకలను కత్తిరించుకుని తిన్నది.అయితే అనుకోకుండా ఆమెకు కడుపులో నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించారు కుటుంబ సభ్యులు.
బొకారోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ సాహు స్వీటీ కుమారికి పరీక్షలు నిర్వహించారు.మూడేళ్ల కిందట అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించగా కడుపులో పెద్ద కణితి ఉందని అనుమానించారు.

ఆపరేషన్ చేయాలని లేకుంటే ప్రాణానికే ప్రమాదమన్నారు.దీంతో ఆపరేషన్ నిర్వహించగా పొత్తి కడుపులో భారీ ముద్దలో ఉన్న హెయిర్ బాల్ ను కనుగొన్నారు.

ఆపరేషన్ నిర్వహించిన వైద్య బృందం ఆ ఏడు కిలోల హెయిర్ బాల్ ని చూసి షాక్ అయ్యారు.ఏదేమైనప్పటికీ స్వీటీ కుమారికి నిర్వహించిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.

చాలా రోజుల నుంచి జట్టును నమిలి మింగడం వల్ల పేగు పరిస్థితి అలా ఏర్పడిందని, దీనిని రాపన్జెల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్ సాహు పేర్కొన్నారు.తన 40 ఏళ్ల సర్వీసులో ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube