కల కంటూ చేతికి ఉన్న రింగ్ ని మింగేసిన యువతి,చివరికి!  

Woman Swallow Engagement Ring During Nightmare-dream Jenna And Babi,endoscope,jenna,woman Swallows Engagement Ring,x Ray

ఎవరైనా కల కంటారు అని తెలుసు కానీ కలలో ఏమి చేస్తే బాహ్య ప్రపంచంలో కూడా అదే పని చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు.సాధారణంగా కల కనేటప్పుడు ఎదో కాలు పైకి లేపడమో,లేదంటే ఎదో తింటున్నట్లు మూతిని ఆడించడమో చేస్తుంటాం.

Woman Swallow Engagement Ring During Nightmare-Dream Jenna And Babi Endoscope Jenna Woman Swallows X Ray

కానీ ఒక యువతి మాత్రం తన ఎంగేజ్మెంట్ రింగ్ మింగినట్లు కల గని నిజంగానే తన రింగ్ ని మింగేసిన ఘటన కాలిఫోర్నియా లో చోటుచేసుకుంది.నిద్రలో రింగ్ మింగినట్లు కలగనిని ఆ యువతి పొద్దున్న నిద్ర లేచి చూసుకుంటే నిజంగానే చేతికి ఉన్న రింగ్ మిస్ అయ్యింది.

అయితే హడావిడి లో ఎక్కడో పెట్టి ఉంటాను అని భావించి అంతా వెతుకగా ఎక్కడా లభించకపోవడం తో అసలు విషయం అర్ధం అయ్యింది.కలగన్నట్లే నిజంగానే రింగ్ మింగినట్లు గుర్తించిన ఆ యువతి నేరుగా డాక్టర్ వద్దకు ఏడ్చుకుంటూ వెళ్ళింది.

Woman Swallow Engagement Ring During Nightmare-Dream Jenna And Babi Endoscope Jenna Woman Swallows X Ray


  డాక్టర్ కు విషయం చెప్పగా వెంటనే ఎక్స్ రే తీసి చూశారు.ఆశ్చర్యం నిజంగానే ఆ యువతి రింగ్ మింగినట్లు డాక్టర్ గుర్తించారు.

అసలు ఈ ఘటన వివరాల్లోకి వెళితే….జెన్నా ఈవన్స్ అనే యువతికి… బాబ్ హోవెల్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరింది.

వీరద్దరీ ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయ్యింది.అయితే తనకు నిత్యం ఏవో ఒక కలలు వస్తాయని, అందులోనూ స్పష్టమైన కలలు వస్తాయంటూ జెన్నా తెలిపింది.

ఈ క్రమంలోనే ఒక కల కనింది జెన్నా.‘ కలలో బాబీ, జెన్నా హైస్పీడ్ ట్రైన్‌లో వెళ్తున్నారు.

అంతలో కొందరు దండగులు వారిపై దాడి చేసి దోచుకునేందుకు ప్రయత్నించారు.దీంతో జెన్నా తన చేతికి ఉన్న ఎంగేజ్ మెంట్ రింగ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో దాన్ని నోటిలో వేసుకుంది.

ఓ గ్లాస్ నీళ్ల సాయంతో రింగ్‌ను మింగేసింది’.అయితే తెల్లారి లేచి చూసే సరికి అది నిజం కాదు కల అని తెలుసుకున్న జెన్నా కి దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసింది.

అదే తన చేతికి ఉన్న రింగ్ మిస్ అవ్వడం, దీనితో నిజంగా కలలో జరిగినట్లు రింగ్ ని మింగేసినట్లు గుర్తించి వెంటనే తన ఫియాన్సీ బాబ్ కు విషయాన్నీ తెలిపింది.అయితే విషయం విన్న బాబ్ ముందు నవ్వినప్పటికీ జెన్నా ఏడవడం తో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

అయితే విషయం తెలుసుకున్న డాక్టర్స్ ముందుగా ఎక్స్ రే తీయగా జెన్నా కడుపులో రింగ్ ఉండడాన్ని చూసి వారు సైతం ఆశ్చర్యపోయారు.

ఆ తరువాతవెంటనే ఆమెకు ఎండోస్కోపి నిర్వహించి కడుపులో ఉన్న ఎంగేజ్ మెంట్ రింగ్‌ను బయటకు తీయడం తో ఇద్దరూ శాంతించారు.

ప్రస్తుతం జెన్నా క్షేమంగానే ఉందట,ఈ విషయాన్నీ అంతా కూడా పేస్ బుక్ ద్వారా జెన్నా నే స్వయంగా షేర్ చేసుకుంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.

అయినా కల కంటూ రింగ్ మింగడం ఏంటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

.

తాజా వార్తలు

Woman Swallow Engagement Ring During Nightmare-dream Jenna And Babi,endoscope,jenna,woman Swallows Engagement Ring,x Ray Related....