ఇంటి నుంచి పారిపోయిన యువతి పాపం చివరకు ఇళ్లు చేరిందిలా.. ?

ఆడపిల్లలకు రక్షణ కరువైన ఈ రోజుల్లో వారు ఇంటి నుండి బయటకు వెళ్లితే వచ్చే వరకు కన్న తల్లిదండ్రులకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయ.ఎక్కడ చూడూ ఆడది కనిపిస్తే ఆశగా చూసే తోడేళ్లు ఉన్న ఈ సమాజంలో వారి బారినుండి ఆడపిల్లలను కాపాడటం ప్రస్తుత కాలంలో ఓ యజ్ఞంలా మారిపోయింది.

 Shakhapalli, Bellampalli, Woman, Suspected Death,viral-TeluguStop.com

ఇకపోతే వారం రోజుల క్రితం అలిగి ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి చివరకు అనుమానాస్పదంగా మృతి చెంది శవమై ఇళ్లు చేరిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం శాఖపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.ఈ గ్రామానికి చెందిన దుర్గం మహేశ్వరి ఈనెల 14న రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లిందట.

యువతి కోసం రెండు రోజులు వెతికినా ఆచూకీ లేక పోవడంతో ఈనెల 16న తాళ్ల గురజాల పోలీస్ స్టేషన్​లో ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారట.కాగా నిన్న సాయంత్రం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారట.

 Shakhapalli, Bellampalli, Woman, Suspected Death,viral-ఇంటి నుంచి పారిపోయిన యువతి పాపం చివరకు ఇళ్లు చేరిందిలా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఘటన స్దలానికి చేరుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube