విమానంలో ఒంటరిగా ప్రయాణం... ఈమెకు దక్కిన అదృష్టం ప్రపంచంలో ఎవరు పొందలేరేమో

విమానంలో ఒంటరిగా ప్రయాణించేందుకు చార్టెడ్‌ ఫ్లైట్స్‌ ఉంటాయి.అయితే ఆ చార్టెడ్‌ విమానాలకు లక్షల్లో ఖరీదు ఉంటుంది.

 Woman Surprise For Being The Only Passenger In In Pal Flight To Manila-TeluguStop.com

కొందరు సొంతంగా విమానాలను కలిగి ఉంటారు.సొంత విమానాలకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.

తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసే వారికి నలుగురితో నారాయణ అన్నట్లుగా అందరితో కలిసి వెళ్లాల్సి ఉంటుంది.తక్కువ ఖర్చుకు కూడా ఒంటరి ప్రయాణం ఏ ఒక్కరికి దక్కదు.

అంటే టికెట్టు కొన్న వారికి చార్టెడ్‌ ఫ్లైట్‌లో వెళ్లినట్లుగా ఒక్కరిని తీసుకు వెళ్లరు.కాని ఫిలిపిన్స్‌కు చెందిన లూసియా ఎరిస్పేకు మాత్రం ఆ అరుదైన అవకాశం దక్కింది.

దావో నుండి మనీలా వెళ్లడానికి ఆమె ఫిలిపిన్స్‌ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన పీఆర్‌ 2820 విమానం ఎక్కేందుకు టికెట్టు తీసుకుంది.ఆ టికెట్టు తీసుకున్న సమయంలో ఆమెకు తెలియదు, తాను ఒక అద్బుతమైన జర్నీని చేయబోతున్నట్లుగా, తన కోసం పూర్తి ప్లైట్‌ ఎదురు చూస్తుందని.ఆమె విమానం ఎక్కిన తర్వాత ఆశ్చర్య పోయింది.కొన్ని కారణాల వల్ల ఆ విమానంకు సంబంధించిన టికెట్లను ఆ రోజు ఎవరు కొనుగోలు చేయలేదు.లూసియా మాత్రం ఆ విమానం టికెట్టు కొనుగోలు చేసింది.ఆమె టికెట్టు కొనుగోలు చేయడం వల్ల ఆమె ఒక్కదానికోసం ఎయిర్‌ లైన్స్‌ వారు ట్రిప్‌ వేశారు.

విమానం బయుజేరే సమయానికి ఎవరైనా వస్తారేమో అని లూసియా భావించింది.కాని విమానం టేకాఫ్‌ అయ్యేందుకు సిద్దం అయ్యిందంటూ పైలెట్‌ ప్రకటించగానే తన ఆనందానికి అవదులు లేకుండా పోయింది.తాను మాత్రమే ప్రయాణిస్తున్నట్లుగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.విమాన సిబ్బందితో ఫొటోలు దిగి తన సంబురంను పంచుకుంది.ప్రపంచంలోనే అత్యంత లక్కీ ప్యాసింజర్‌గా లూసియాకు గుర్తింపు దక్కింది.లక్షలు ఖర్చు చేసినా ఇలాంటి ప్రయానం దక్కదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెద్ద విమానంలో ఒకే ఒక్క ప్యాసింజర్‌ ఉండటం చరిత్రలో ఇదే ప్రథమం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube