మూడు రోజులు పాటు తల్లి శవంతో కూతురు.. చివరికి ?  

bengal woman, dead mother, three days, Woman Stayed with Mother Dead Body for three Days - Telugu

ఇక్కడ ఒక కూతురు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.మామూలుగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహిస్తారు.

 Woman Stayed Mother Dead Body Three Days

ఇక్కడ కూతురు మాత్రం తన తల్లి చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ బెడ్రూంలో తల్లి శవాన్ని దాచిపెట్టి నాటకాలు ఆడుతుంది.చివరికి దుర్వాసన రావడంతో స్థానికులు అందరూ నిలదీయగా అసలు విషయం బయటపడింది.

ఈ దారుణ ఘటన బెంగాల్ హుగ్లీ ప్రాంతం శ్రీరాంపూర్ లో వెలుగులోకి వచ్చింది.

మూడు రోజులు పాటు తల్లి శవంతో కూతురు.. చివరికి -General-Telugu-Telugu Tollywood Photo Image

చనిపోయి దాదాపు మూడు రోజులు అవుతుంది… కూతురు శవానికి అంత్యక్రియలు జరపలేదు.

సోనాలి రాయ్ అనే మహిళ తల్లి సుష్మ రాయ్ ఇటీవలే కన్నుమూశారు.ఇక తల్లికి అంత్యక్రియలు జరుగకుండా బయట ఎవరికీ ఈ విషయం చెప్పకుండా కూతురు సోనాలి తల్లి శవాన్ని బెడ్ రూమ్ లో దాచి పెట్టింది.

మూడు రోజులు గడిచిపోయింది.

ఇక ఆ తర్వాత శవం కుళ్లిపోయి దుర్వాసన రావడం మొదలైంది.

చుట్టుపక్కల వారందరికీ అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా బెడ్రూంలో సోనాలి తల్లి మూడు నాలుగు రోజుల క్రితం చనిపోయిన మృతదేహం కనిపించింది.మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు.

కూతురు సోనాలి ఇలా ఎందుకు చేసింది అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,

.

#Bengal Woman #Three Days #Dead Mother #WomanStayed

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Stayed Mother Dead Body Three Days Related Telugu News,Photos/Pics,Images..