కనుబొమ్మలతో ముఖాన్ని కప్పేసుకున్న ఆమెను చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

మ‌గువ‌కు స్థిరమైన జీవన ప్రమాణాలు లేవు, వస్త్రధారణ, అలంకరణకు స్థిరమైన నమూనా లేదు.ఒక అమ్మాయి ఎప్పుడూ సమాజం లేదా ప్రజలు కోరుకునే విధంగా ఉండకూడదు….

 Woman Started Painting Her Eyebrows Massive One Year Details, Mother, Big Eye Br-TeluguStop.com

అంటూ ఓ తల్లి ప్రచారం ప్రారంభించింది.అది ముందుగా త‌న‌తోనే ప్రారంభ‌మ‌వ్వాల‌నుకుంది.

జనాలు ఆమెను పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నప్పటికీ, ఆమె దేనికీ భయపడటం లేదు.సామీ-జో హెయిల్‌ఫోర్డ్ అతిపెద్ద కనుబొమ‌లు క‌లిగిన మహిళగా గుర్తింపు పొందింది.

ఆమె క‌నుబొమ‌ల‌ కారణంగా ఆమెను చాలామంది ఇష్టపడరు.పిల్లలు ఆమెను చూసి భయపడతారు.

అమ్మాయిలు ఆమెను చూసి న‌వ్వుతారు.అయినా ఆమె తన స్వంత ఇష్టానికి, త‌న ఎంపికతో జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది.

ఇతరులకు కూడా అదే సలహా ఇస్తుంది.పెద్ద కనుబొమ‌లు క‌లిగిన‌ కారణంగా సామీని సోషల్ సైట్‌లలో చాలా ట్రోల్ చేస్తుంటారు .కొందరు ఆమెను భయంకరమైనద‌ని, మరికొందరు అగ్లీ అని అంటారు.చాలా మంది ఇంకా ముందుకు వెళ్లి ఇలాంటి రూపం ఉన్న మహిళను ఏ అబ్బాయి కూడా ఇష్టపడడు అని వ్యాఖ్యానిస్తున్నారు.

అలాగే ఆమ‌ను జీవితంలో ప్రేమించే వ్యక్తి కూడా దొర‌క‌డు అంటారు.ఇలాంటి మాట‌లు విని విని సామీ వీరిపై కోపం తెచ్చుకోదు.తనను తాను మార్చుకోవాలని కూడా అనుకోదు.తాను నేను మేకప్ వేసుకుని నాకిష్ట‌మైనట్లు జీవించాలని అనుకుంటున్నానని చెబుతుంటుంది.

Telugu Big Eye Brows, Bigger Boy, Bigger Bro, Eyebrows, Mother, Sammy Joe Haird,

ఎవరి ట్రోల్ వల్ల నేను జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకోను.అని చెప్పింది.సామీ చాలా సంవత్సరాలుగా విశాలమైన నల్ల‌ని కనుబొమ‌ల‌ను దిద్దుకుంటోంది.ఆమెకు టిక్‌టాక్‌లో 75,000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.సామీ తన లుక్‌తో ఒక సంవత్సరం క్రితం ఒక ప్రయోగం చేసింది.ఆమె ఈ లుక్ ఇంటర్నెట్‌లో భూకంపం సృష్టించింది.

ఏది ఏమైనప్పటికీ సామీకి చాలా మంది స్నేహితులు, బంధువులు ఉన్నారు.వారు ఆమె కనుబొమ‌లు చూసి భ‌య‌ప‌డ‌రు.

సామీ త‌న మేకప్ సహాయంతో ప్రచారం నిర్వహిస్తుంది, దీని క్యాప్షన్ బిగ్గర్ ది బ్రో, బిగ్గర్ ది బాయ్.చాలా మంది ఆమె తల్లిగా సరిపోదని వ్యాఖ్యానించారు.

దీనిపై సామీ సమాధానం ఏమిటంటే.త‌ల్లిని లుక్ నిర్ణ‌యించ‌దు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube