బార్బీ డాల్ గా మారడానికి ఆ యువతి చేసిన ఖర్చుతో మనం జీవితాంతం హ్యాపీగా బతికేయొచ్చు!

వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు.నేటి తరం యువత నూతన పోకడలకు పోయి ఒళ్ళు గుల్ల చేసుకోవడమే కాకుండా, ఇల్లు కూడా తాకట్టు పెట్టేస్తున్నారు.

 Woman Spent Over 50 Lakh Rupees To Become Human Barbie Details, Barbie Doll, Tru-TeluguStop.com

ఎవరు పిచ్చి వారిదన్నట్టు, కొంతమందికి అందంగా తయారు కావడం అనేది సగటు అలవాటు నుండి ఓ పిచ్చిగా పరిణమిస్తుంది.ఇక్కడ కూడా అలాంటి కధ గురించే చర్చిద్దాం.

జర్మనీకి చెందిన జెస్సీ జన్నీ అనే మామ్మూలు యువతి కట్ చేస్తే, హ్యూమన్ బార్బీగా మారి అందరికీ షాక్ ఇచ్చింది.దీనికోసం ఆమె ఏకంగా 70వేల డాలర్లు అనగా రూ.53.60 లక్షల రూపాయిలు చెల్లించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే, జెస్సీ జన్నీ జర్మనీకి చెందిన ఓ యువతి.హ్యూమన్ బార్బీగా మారాలన్నది ఆమె చిరకాల కోరిక.తన కలను నిజం చేసుకోవాలన్న ఆశతో ఈ క్రమంలో తన సొంత కుటుంబాన్ని కూడా వదిలి ఆస్ట్రేలియాలోని వియోన్నాకు వలస వచ్చేసింది.జెస్సీ వయసు నిండా 21 సంవత్సరాలు.

ఇందుకోసం ఆమె 70వేల డాలర్లు ఖర్చు చేయడం కొసమెరుపు.సగటు ఇండియాలో ఓ మధ్యతరగతివాడు ఈ సొమ్ముతో జీవితాంతం బతికేయగలడు.

అంత సొమ్ముని ఆమె ఖర్చు చేసింది.దీనికోసం వృక్షోజాలాలు, పిరుదులు, పెదాలకు 3 సార్లు శస్త్ర చికిత్స చేయించుకుంది.

Telugu Rupees, Dollars, Barbie Doll, Germany, Barbie, Jessy Bunny, Lakhs, Latest

హ్యూమన్ బార్బీగా మారాలన్న కోరిక ఆమెకు 17ఏళ్ల వయస్సులోనే కలిగిందట.తన తల్లిదండ్రులు, కుటుంబంలో చాలా సంప్రదాయాలు ఉంటాయని, దానికి వారు నో చెప్పారని, దాంతో వారిని విడిచి బయటకు రావలసి వచ్చిందని చెబుతోంది ఈ అమ్మడు.తన మొదటి రొమ్ము శస్త్రచికిత్స కోసం తన తల్లి, తండ్రి నుండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి అని చెప్పి డబ్బులు తీసుకొని, వాటితో మొదటి రొమ్ము పెరుగుదల చికిత్స కోసం ఉపయోగించిదట.మొదట కష్టంగా వున్నా, తరువాత తరువాత తనకు నమ్మకం కలగడంతో తన మొత్తం శరీరాన్ని బార్బీ డాల్ గా మార్చాలని యోచిస్తోన్నట్లు తెలిపింది.

ఇక అంత సంతోషంగానే వున్నా, తన కన్నవాళ్ళు తనని దూరం పెడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube