ఆమె జీవితం అంతా కూడా ఆపరేషన్‌లే, పక్కటెముకలు కూడా లేకుండా చేసుకుంది  

Woman Spent 1.5 Crore Money For Transforming Her Body-for Transforming Her Body,general Telugu News,spent 1.5 Crore Money,woman

అమ్మాయిలు తాము అందంగా ఉండాలనుకోవడంతో పాటు, అందరిలోకి ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ప్రతి అమ్మాయి కూడా తనను ఇతరులు స్పెషల్‌గా చూడాలని భావిస్తారు. అందుకోసం అందంగా ఉండేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు..

ఆమె జీవితం అంతా కూడా ఆపరేషన్‌లే, పక్కటెముకలు కూడా లేకుండా చేసుకుంది -Woman Spent 1.5 Crore Money For Transforming Her Body

ఇక కొందరు అమ్మాయిలు ఏకంగా ఆపరేషన్‌లు చేయించుకుని మరీ అందంగా తయారు అవుతున్నారు. ఇప్పటికే పలువురు అమ్మాయిల గురించి మనం వార్తల్లో చూశాం. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ అందంగా కనిపించేందుకు ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఆపరేషన్‌లు చేయించుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే 18 ఏళ్ల వయసులో తోటి స్నేహితురాళ్లతో పోల్చితే తన వక్షోజాలు చిన్నగా ఉన్నాయని ఆమె భావించింది. దాంతో 6 లక్షలు ఖర్చు చేసి తన వక్షోజాలను పెద్దగా చేయించుకుంది. ఆ ఆపరేషన్‌ సక్సెస్‌ అవ్వడంతో అప్పటి నుండి కూడా తన శరీరంలోని పలు భాగాలకు ఆపరేషన్‌ చేయించుకుంటూనే ఉంది. పిరుదులు, పెదాలు, నడుము, నుదురు ఇలా శరీరంలోని అన్ని భాగాలకు కూడా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది.

ఈ ప్లాస్టిక్‌ సర్జరీలో భాగంగా ఆమె ఏకంగా తన పక్కటెముకలు కూడా తొలగించుకుంది. పక్కటెముకలు లేకుండా జీవించే అవకాశం ఉంది.

కాని చిన్న ప్రమాదం జరిగినా కూడా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. చిన్నప్పటి నుండి అందంపై పిచ్చితో ఆమె ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. త్వరలో ఈమె మరోసారి ఆపరేషన్‌కు సిద్దం అవుతుంది.

ఇంకా ఆపరేషన్‌లు చేయించుకుంటే చనిపోయే అవకాశం ఉంది. అయినా కూడా ఆమె వెనకాడటం లేదు.