అందరూ చూస్తుండగానే 500 మద్యం బాటిల్స్ ని ఆ మహిళ..?  

కొన్ని ఘటనలు చూస్తే చాలా ఆసక్తికరంగా ఆశ్చర్యకరంగా ఉంటాయ్.ఇక అలాంటి ఘటనే యూకేలో చోటు చేసుకుంది.

TeluguStop.com - Woman Smashes 500 Bottles Of Liquor On Supermarket Floor

ఆ ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోతున్నారు.ఎందుకంటే ఆవిడా ఓ సూపర్ మార్కెట్ లో దూరి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 500 మద్యం బాటిల్స్ ని పగలగొట్టింది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఆమె అలా మద్యం బాటిళ్లను పగలు కొడుతుంటే అక్కడున్న సిబ్బంది ఏమాత్రం కలగ చేసుకోకుండా, పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయించారు.

TeluguStop.com - అందరూ చూస్తుండగానే 500 మద్యం బాటిల్స్ ని ఆ మహిళ..-General-Telugu-Telugu Tollywood Photo Image

యూకేలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఈ వింత సంఘటన చోటు చేసుకుంది.

షాపింగ్ మాల్ లోకి వచ్చిన ఆ మహిళ షాపింగ్ చేయకుండా దాదాపు అరగంట పాటు రాక్ లో అమర్చి ఉన్న మద్యం బాటిల్స్ ని పగల కొడుతూనే ఉంది.ఆమె అలా మద్యం బాటిళ్లను పగల కొడుతుంటే అక్కడున్న ఒక కస్టమర్ వెళ్లి తనని ఆపడానికి ప్రయత్నించాడు.

అయితే అతని కాలిపై ఒక మద్యం బాటిల్ ని విసరడంతో మిగతా కస్టమర్లు ఎవరు ఆమెను ఆపడానికి సాహసం చేయలేదు.కేవలం అందరూ చూస్తూ ఉండిపోయారు.

సుమారు 1,30,000 డాలర్లు విలువ చేసే మద్యం బాటిళ్లను పగలగొట్టిన అక్కడ ఎవరు స్పందించకపోవడం ఎంతో ఆశ్చర్యకరమైన విషయం.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది.

చార్లెస్ ఆడమ్స్ అనే వ్యక్తి ఈ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ… పోలీసులు ఎక్కడా? వెంటనే ఎందుకు స్పందించలేదు? మేనేజర్ ఆమె జుట్టు పట్టుకుని అక్కడి నుంచి ఎందుకు లాక్కెళ్లలేదు? అని ప్రశ్నిస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.

కొద్దిసేపటి తరువాత సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించగా బాటిల్స్ పగలడం వల్ల ఆమె కుడి చేతికి కొద్దిగా గాయమైంది.అయితే చికిత్స నిమిత్తం ఆమెను మొదటగా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు.కానీ ఆ మహిళ అలా మద్యం బాటిళ్లను పగలకొట్టడానికి గల కారణాలు ఏమిటో తెలియడం లేదు.

#Liquor Shop #Woman Smashes

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు