భర్త కోసం ఈమె పెట్టిన కండీషన్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.. 2.5 కోట్ల జీతమట..

ప్రస్తుతం ఓ అమ్మాయి తన కాబోయే భర్త కోసం పెట్టిన కండీషన్ల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు, రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

హింజ్( Hinge ) అనే డేటింగ్ యాప్‌లో ఓ అబ్బాయికి ఈ అమ్మాయి ప్రొఫైల్ కనిపించింది.ప్రొఫైల్‌లో ఆమె పెట్టిన కండీషన్లు చూసి అబ్బాయికి మైండ్ బ్లాక్ అయిపోయింది.

వెంటనే మెసేజ్ పెట్టాడు.అబ్బాయి మెసేజ్ చేస్తూ, "మీ ప్రొఫైల్ చూశాను.

ఆ కండీషన్ల లిస్ట్( Conditions List ) ఏంటో చెప్పండి" అని అడిగాడు.అమ్మాయి కూడా ఏ మాత్రం మొహమాట పడకుండా "చూపిస్తానా?" అంటూ రిప్లై ఇచ్చింది.అబ్బాయి సరే అనగానే, ఆ లిస్ట్ చూసి అబ్బాయికి గుండె ఆగినంత పనైంది.

Advertisement

ఆ అమ్మాయి పంపిన లిస్ట్ పేరు ఏంటో తెలుసా? "భర్తకు ఉండాల్సిన కనీస అర్హతలు" అంట.అందులో ఒకటి కాదు రెండు కాదు.ఏకంగా 18 కండీషన్లు పెట్టింది.

అందులో కొన్ని వింటే షాక్ అవుతారు.రెండున్నర కోట్ల జీతం ఉండాలట.

అబ్బాయి ఫిట్‌గా, అట్రాక్టివ్‌గా కనిపించాలట.లగ్జరీ లైఫ్‌స్టైల్( Luxury Lifestyle ) అంటే ఇష్టపడాలట.

మర్యాదగా మెలగాలట.ఇంకా పిల్లల్ని కనే విషయంలో పూర్తి కంట్రోల్ తనకే ఉండాలట.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

అబ్బో.లిస్ట్ ఇంకా చాలా పెద్దదే.

Advertisement

భర్త ఎప్పుడూ సపోర్టివ్‌గా, స్టైలిష్‌గా, నీట్‌గా ఉండాలట.

అబ్బాయికి కోపం వచ్చిందో ఏమో, వెంటనే ఆ అమ్మాయి చాటింగ్ స్క్రీన్ షాట్స్, కండీషన్ల లిస్ట్ రెడిట్‌లో పోస్ట్ చేశాడు.అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్( Viral ) అయిపోయింది.నెటిజన్లు అమ్మాయిని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

"అంత పెద్ద లిస్ట్ పెట్టిందే కానీ, తను మాత్రం వాటికి తగ్గట్టు ఉందా" అని కామెంట్లు పెడుతున్నారు.ఒక నెటిజన్ అయితే మరీ కామెడీగా "నువ్వు కూడా కండీషన్లు పెట్టి ఆ లిస్ట్ ఆమెకు రివర్స్ లో పంపు.

అప్పుడు చూడు ఎలా రియాక్ట్ అవుతుందో" అని సలహా ఇచ్చాడు.ఆ పోస్ట్ చేసిన అబ్బాయి "నేను కూడా ఊరికే ఉండకుండా ఆమెను నీ క్వాలిఫికేషన్స్ ఏంటి? అని అడిగాను.దాంతో అమ్మాయికి కోపం నషాళానికి ఎక్కింది.

తను పార్ట్ టైమ్ పర్సనల్ ట్రైనర్ అట.సంవత్సరానికి 10 వేల డాలర్లు కూడా సంపాదించదట." అని అన్నాడు.

ఇంకా ఫన్నీగా "నేను వైన్ బాటిల్ పట్టుకుని ఇంటికి రమ్మన్నాను.అంతే అమ్మడు వెంటనే నన్ను అన్‌మ్యాచ్ చేసేసింది" అని చెప్పాడు.

ఇంకో నెటిజన్ అయితే లెక్కలు తీసి మరీ చెప్పాడు."అమెరికాలో( America ) కేవలం 2.3% మంది మగవాళ్లు మాత్రమే సంవత్సరానికి 3 లక్షల డాలర్ల కంటే ఎక్కువ సంపాదిస్తారు.వాళ్లందరూ సింగిల్ గా ఉండరు కదా? అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోరు కదా?" అంటూ లాజిక్ మాట్లాడాడు.కొందరు మాత్రం "ఒక్కొక్కరికి ఒక్కో స్టాండర్డ్ ఉంటుంది.

అందులో తప్పేముంది?" అని అమ్మాయికి సపోర్ట్ చేశారు.కానీ చాలా మంది మాత్రం అమ్మాయి లిస్ట్ మరీ ఓవర్ అని పెదవి విరిచారు.

ఒక నెటిజన్ అయితే ఫైనల్ పంచ్ ఇచ్చాడు."ఒకవేళ అలాంటి మొగుడు దొరికితే.

అతను వైన్ బాటిల్, ట్యాక్స్ పేపర్లు పట్టుకుని రావాలి.ఇంకా ముఖ్యంగా గిన్నెలు కడగడం కూడా ఇష్టపడాలి" అంటూ ఫన్నీ కామెంట్ పెట్టాడు.

తాజా వార్తలు