కాబోయే భర్తని అమ్మేసిన యువతి... ఇంతకీ ఎందుకో తెలుసా..

భర్త ని అమ్మేసిన భార్య ఇటువంటి విషయాలు మనకు వినిపించినపుడు మనకు ముందుగా గుర్తొచ్చేది ‘ శుభలగ్నం ‘ తెలుగు సినిమా అందులో ఆమని తన భర్త అయిన జగపతి బాబు ని తను ధనవంతురాలు అవడానికి అమ్మేస్తుంది.ఇలాంటి సంఘటనే ఒక యువతి జీవితం లో నిజంగా జరిగింది ఆమె తనకు కాబోయే భర్త ని అమ్మేసింది ఇంతకీ ఎవరికో తెలుసా.

 Woman Sells Her Boyfriend-TeluguStop.com

తనను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి తల్లిదండ్రులకే.అసలు విషయం ఇదే.

రెడిట్ అనే సైట్ లో ఒక యువతి తన జీవితం లో జరిగిన ఒక వింత అనుభవం గురించి అందులో పేర్కొంది.ఆమె పేరు ని ఆ సైట్ లో పేర్కొనలేదు.

విషయానికొస్తే ఆ యువతి ఒక అబ్బాయి తో చాలా కాలంగా ప్రేమలో ఉందంట.తను అబ్బాయిని చాలా గాఢంగా ప్రేమించింది ,ఎలాగైనా తననే పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండలనుకుంది.

అయితే ఆ అబ్బాయి కుటుంబం వాళ్ళకి ఆ అమ్మాయి అంటే అసలు ఇష్టం లేదు దానికి కారణం ఆమె కి పెద్దగా ఆస్తులు లేకపోవడం.అబ్బాయి ధనవంతుడు కావడం తో అబ్బాయి వాళ్ల అమ్మ వారి ప్రేమకు ఒప్పుకోలేదు.

ఇంట్లో చెప్పకుండా ఆ అమ్మాయి అబ్బాయి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.ఇంటికి దూరంగా సహజీవనం సాగించారు.అయితే కొన్నాళ్ళు గడిచాక ఆ అబ్బాయి అసలు ప్రవర్తన బయటకి వచ్చింది.అతను ఒక పెద్ద అనుమానస్తుడు అని ఆమెకి తెలిసింది.

ఆమె ఎక్కడికి వెళ్లినా తను ఆమె గురించి ఆమెకి తెలియకుండా ఆరాధిసేవాడు.అది ఆమెకి నచ్చలేదు.

పైగా అతను తాగుబోతు కూడా ప్రతి రోజు రాత్రి తాగి ఇంటికి వచ్చేవాడు.దానితో ఆ అమ్మాయి అతడి తో పెళ్లిని రద్దు చేసుకోవలనుకుంది.

కొన్ని రోజులకు అబ్బాయి వల్ల తల్లి అమ్మాయికి ఫోన్ చేసి తన కొడుకు ని వదిలేయమని ప్రాధేయపడింది దానితో పాటు తనకు కొంత డబ్బులు కూడా ఇస్తానంది అబ్బాయి వాళ్ల తల్లి.ఎలాగూ అతని నుండి విడిపోవలనుకున్న తను అతని తల్లి దగ్గరి నుండి 10000 డాలర్ల ను తీసుకొని ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకుంది.

ఈ విషయం గురించి రెడిట్ లో పోల్ పెట్టగా అందులో కొంత మంది ఆమె చేసిన పనిని వ్యతిరేకిస్తూ కామెంట్ లు చేశారు.నీకు ప్రేమ గురించి తెలియదు కనీసం నీ ప్రియుడి గురించి ఆలోచించకుండా ఎలా బ్రేక్ అప్ చేసుకున్నావ్ అంటూ విమర్శించారు.అలాగే మరికొందరు మంచి పని చేశావ్ లేకుంటే తాగుబోతు భర్త తో జీవితం నాశనం అయిపోయిది అంటూ కామెంట్ లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube