చనిపోయిన మహిళ 27 నిమిషాలకు లేచింది.. ఆమె చెప్పిన విషయాలు శాస్త్రవేత్తలకే మతి పోగొడుతున్నాయి  

Woman Sees Heaven Scrawls Its Real After She Dies For 27 Minutes-

మనిషి చనిపోతే చేసిన కర్మల అనుసారంగా స్వరం లేదా నరకంకు వెళ్తాడని ఎక్కువ శాతం మంది నమ్మకం.మతం ఏదైనా కూడా చనిపోయిన తర్వాత దేవుడు తీసుకు వెళ్తాడని స్వర్గం నరకం ఉంటాయని అందరి నమ్మకం.

Woman Sees Heaven Scrawls Its Real After She Dies For 27 Minutes--Woman Sees Heaven Scrawls Its Real After She Dies For 27 Minutes-

హిందువులు స్వర్గంలో ఇంద్రుడు ఉంటాడని అంటారు.క్రిస్టియన్స్‌ ఏసు ఉంటాడని నమ్ముతారు.వారి వారి దేవుళ్లు వాళ్ల స్వర్గంలో ఉంటారని ప్రతి ఒక్కరి నమ్మకం.అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాలను కొట్టి పారేస్తూ ఉంటారు.ఈ సృష్టిలో స్వర్గం నరకం అనేవి ఏమీ ఉండవని, అవన్ని ఒట్టి పుకార్లు కొందరు సృష్టించిన పదాలు మాత్రమే అని, అవి నిజంగా ఉండవు అని అంటూ ఉంటారు.కాని తాజాగా ఒక మహిళ మాత్రం స్వర్గంను చూసి వచ్చానంటూ శాస్త్రవేత్తలకు మతి పోగొట్టేంత పని చేసింది.

Woman Sees Heaven Scrawls Its Real After She Dies For 27 Minutes--Woman Sees Heaven Scrawls Its Real After She Dies For 27 Minutes-

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అమెరికాలోని అరిజోనా రాష్ట్రంకు చెందిన టీనా హీనస్‌ అనే మహిళకు పర్వతాలు ఎక్కడం అంటే సరదా.ఆమె ఇప్పటి వరకు ఎన్నో పర్వతాలను ఎక్కింది.అయితే మొన్న ఫిబ్రవరిలో ఆమె ఒక పర్వతంను ఎక్కుతున్న సమయంలో గుండెపోటు వచ్చింది.

వెంటనే ఆమె పక్కన ఉన్న వారు ఆంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.ఆంబులెన్స్‌ లోనే ఆమెకు ప్రధమ చికిత్స చేశారు.గుండె ఆగిపోకుండా షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తూ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లారు.అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్ధారించారు.

టీనా చనిపోయిందని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది.కుటుంబ సభ్యులు శోకంలో ఉన్న సమయంలో 27 నిమిషాల తర్వాత సృహలోకి వచ్చింది.ఆ సమయంలో ఆమె ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించింది.కాని ఆమె మాట్లాడలేక పోయింది.దాంతో ఆమె ఏదో రాసి చూపిస్తానంటూ సైగ చేసింది.వెంటనే పెన్ను పేపర్‌ ఇవ్వగానే ఇట్స్‌ రియల్‌ అనే పదం రాసింది.ఆమె పెన్ను సరిగా పట్టుకోలేక పోయినా కూడా ‘ఇది నిజం’ అనే అర్థం వచ్చేట్లుగా రాసింది.ఆమె ఏం చెప్పాలనుకుంటుందో కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు.దాదాపు మూడు నెలల తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది.తాజాగా ఆమెను ఆ నిజం ఏంటీ అంటూ ప్రశ్నించిన సమయంలో హెవెన్‌(స్వర్గం) అనేది నిజం అంటూ చెప్పుకొచ్చింది.

తాను స్వర్గంను చూశానంటూ ఆమె చెప్పుకొచ్చింది.రంగుల మయం అయిన ఒక ప్రపంచంలోకి నేను వెళ్లాను.అక్కడ జీసన్‌ ఉన్నారు.ఆయన చాలా శాంతంగా ఉన్నారు.ఆయన్ను చూడగానే నా కళ్లు మరింత కాంతిని చూసినట్లుగా అనిపించిందని చెప్పుకొచ్చింది.ఈమె చెప్పిన మాటలు ప్రస్తుతం శాస్త్రవేత్తల మెదడుకు పదును పెట్టినట్లయ్యింది.నిజంగానే స్వర్గం ఉందా అంటూ శాస్త్రవేత్తలు ఆలోచించడం మొదలు పెట్టారు.మరి కొందరు మాత్రం ఆమె ఏదో కల కని ఉంటుందని లేదంటే ఏదైనా భ్రమలో ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కాని ఎక్కువ శాతం మంది మాత్రం ఆమె నిజంగానే స్వర్గం చూసి వచ్చిందని నమ్ముతున్నారు.