భర్త పబ్ జీ గేమ్ ఆడనివ్వలేదని ఆ భార్య ఏం చేసిందో తెలుసా... అసలు విషయం ఇదే...  

Woman Seeks Divorce As Husband Stops Her From Playing Pubg-play Store,pubg,పోలీస్ స్టేషన్,యూఏఈ

పబ్ జీ ఇటీవల కాలం లో ఎక్కువగా వినిపిస్తున్న మొబైల్ గేమ్ , ఈ గేమ్ పైన కొన్ని నెలలు గా ప్రపంచ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ గేమ్ వల్ల ఎంతో మంది పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు ఈ గేమ్ వయస్సు తో సంబంధం లేకుండా అన్ని వయస్సు ల వారు ఆడేస్తారు..

భర్త పబ్ జీ గేమ్ ఆడనివ్వలేదని ఆ భార్య ఏం చేసిందో తెలుసా... అసలు విషయం ఇదే...-Woman Seeks Divorce As Husband Stops Her From Playing PUBG

ఈ గేమ్ ఆడే వారు వారి కుటుంబ సభ్యులకు సమయాన్ని వెచ్చించడం లేదని కొందరు అభిప్రాయ పడుతుంటే మరికొందరు గేమ్ ఆడడం వల్ల ఎక్కువ సేపు మొబైల్ తోనే ఉంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని మరికొందరి వాదన. అయితే ఇటీవల కాలం లో పిల్లలు గేమ్ ఆడడం గురించి వార్తలు విన్నాం . అయితే యు.

ఏ.ఈ లో ఏకంగా భర్త పబ్ జీ అడనివ్వడం లేదని పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఒక యువతి.అసలు విషయానికి వస్తే…పబ్ జీ మొబైల్ గేమ్ పిల్లల నే కాదు పెద్ద వారిని కూడా ఈ గేమ్ కి బానిసలు గా మారుతున్నారు. ఏ పని చేయకుండా గేమ్ ఆడడం వల్ల కుటుంబ సభ్యుల తో మనస్పర్థలు తెచ్చుకుంటున్నారు. అందుకే ఈ గేమ్ ని కొన్ని దేశాలలో బ్యాన్ చేశారు , అక్కడ ప్లే స్టోర్ లో గేమ్ అందుబాటులో ఉండకుండా అక్కడి ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.అయితే ఇటీవల యూఏఈలోని అజ్మన్‌లో పబ్ జీ వల భార్య భర్తల మధ్య పెద్ద గోడవై విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది .

20 ఏళ్ల ఓ యువతి అజ్మన్ పోలీసుల శాఖకు చెందిన సోషల్ సెంటర్‌కు వెళ్లి ‘నన్ను నా భర్త పబ్‌జీ గేమ్ ఆడుకోనివ్వడం లేదు , మాకు విడాకులు ఇప్పించండి’ అని కోరింది. ఆ విషయం విన్న అక్కడి పోలీస్ లు షాక్ అయ్యారు , వెంటనే ఆ అమ్మాయి భర్త కి ఫోన్ చేసి స్టేషన్ కి పిలిపించారు. తన స్వేచ్ఛను భర్త హరిస్తున్నాడని ఆమె అంటుండగా , ఆమె కుటుంబ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలనే ఉద్దేశంతోనే తాను అలా చేశానని భర్త సమాధానం ఇచ్చాడు. అలా పోలీస్ శాఖ స్టేషన్ లో ఒకరికొకరు వాదించుకోవడం తో అక్కడి పోలీస్ లకి తల ప్రాణం తోకకొచ్చింది , చివరికి వారిద్దరి మధ్య సమస్యను పరిష్కరించి వారిని కలిసి ఉండాలని ఇంటికి పంపించేశారు.

ఈ ఒక్క విషయమే కాదు పిల్లలు పబ్ జీ లకి అలవాటు పడిపోవడం వల్ల తల్లిదండ్రులు మందలించారని కొంత మంది పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా పబ్ జీ వల్ల కుటుంబం లో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా ఒక మొబైల్ గేమ్ పిల్లలని , పెద్దలని నిద్ర లేకుండా చేస్తుంది…