జనసేన అధినేత జగనన్నకు నమస్కారం  

woman says janasena chief jagan instead of pavan in front of pavan kalyan - Telugu Jagan Pavan Meeting Chitturu Rayalaseema Ysrcp Ap Cm Jagan Dwakra

మీరు చదివిన హెడ్డింగ్ కరెక్టే.జనసేన అధినేత జగనన్న అంటూన్నారేంటి అనే కదా మీ డౌట్.

Woman Says Janasena Chief Jagan Instead Of Pavan In Front Of Pavan Kalyan

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తూ వాడి వేడిగా ప్రసంగాలు, పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు.

దీనిలో భాగంగానే ప్రజలతో మమేకం అవుతూ వారితో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.తాజాగా చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు.

అయితే అక్కడ ఆయనకు ఊహించని అనుభవం ఎదురయ్యింది.అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది.

ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు.

ఓ మహిళ తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ జనసేన అధినేత జగనన్నకు నమస్కారం అని అనడంతో జనసేన కార్యకర్తలు ఆశ్చర్యపోయారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనాల్సింది పొరపాటున ఆమె జగనన్న అని అనడంతో అంతా షాక్ అయిపోయారు.తన సభలో సీఎం జగన్ ప్రస్తావన రావడంతో పవన్ కల్యాణ్ కూడా షాక్ అయ్యారు.

కొద్ది సేపటి దాకా ఆయన తేరుకోలేదు.వెంటనే స్పందించిన జనసేన కార్యకర్తలు ఇది వైసీపీ కాదమ్మా అంటూ గట్టిగా కేకలు వేయడంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Says Janasena Chief Jagan Instead Of Pavan In Front Of Pavan Kalyan Related Telugu News,Photos/Pics,Images..