మారని బుద్ధి: గతంలో 3,500 ఏళ్లనాటి చెట్టును కాల్చేసింది, ఇప్పుడు డ్రగ్స్  

Woman Who Burned Down 3,500 Year Old Historic Tree With Smoking-500 Year Old Historic Tree,burned Down 3,nri,sara Barns,telugu Nri News Updates

రోడ్డు కోసమో, ఇంటి కోసమో లేక మరేదైనా కారణం వల్లనైనా మనదేశంలో విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తారు.కొందరు సరదా కోసం చెట్లను కూలుస్తాంటారు.కాగితాలపై బలమైన శిక్షలు ఉన్నప్పటికీ.శిక్షలు పడ్డ దాఖలాలు చాలా తక్కువ.అయితే అమెరికాలో అలా కాదు.అక్కడ చెట్లకు ప్రజలు, ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తాయి.

Woman Who Burned Down 3,500 Year Old Historic Tree With Smoking-500 Year Old Historic Tree,burned Down 3,nri,sara Barns,telugu Nri News Updates-Woman Who Burned Down 3 500 Year Old Historic Tree With Smoking-500 Burned Nri Sara Barns Telugu Nri News Updates

ఈ క్రమంలో 3,500 ఏళ్ల నాటి చెట్టును కాల్చేసిన మహిళను మాదకద్రవ్యాల కేసులో పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు.సారా బర్న్స్ అనే మహిళ 2012లో లాంగ్‌వుడ్ ప్రాంతంలో సిగరేట్ కాలుస్తూ 118 అడుగుల ‘‘బాల్డ్ సైప్రస్’’ అనే చెట్టును కాల్చివేసింది.

Woman Who Burned Down 3,500 Year Old Historic Tree With Smoking-500 Year Old Historic Tree,burned Down 3,nri,sara Barns,telugu Nri News Updates-Woman Who Burned Down 3 500 Year Old Historic Tree With Smoking-500 Burned Nri Sara Barns Telugu Nri News Updates

‘ది సెనేటర్‌’గా పేర్కొనే ఈ చెట్టుకు సుమారు 3,500 సంవత్సరాల నాటిది.ఇది ప్రపంచంలోని పురాతన వృక్షాలలో ఐదవదిగా గుర్తింపు పొందింది.ఈ కేసులో సారాను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.దీని నుంచి బయటపడిన ఏడేళ్ల తర్వాత తాజాగా శుక్రవారం ఫ్లోరిడాలోని ఆల్టమొంటే స్ప్రింగ్స్ నివాసంలో 33 గ్రాముల నిషేధిత మెథామ్ఫెటామైన్ డ్రగ్‌ను పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు.ఈ వ్యవహారంలో సారా నవంబర్ 12న కోర్టులో హాజరుకానున్నారు.