టిక్‌టాక్ దెబ్బకు ఆ ఇల్లాలు ఏం చేసిందంటే?  

Woman Runs Away With Girl Due To Tiktok Effect-girl,kurnool News,tiktok,weird News,woman

ప్రస్తుతం జనం టిక్‌టాక్ మాయలో పడి తమను తాము అదుపు చేసుకోలేకపోతున్నారు.ఇప్పటికే టిక్‌టాక్ మాయలో పడి పలువురు నవ్వుల పాలు కాగా, మరికొంత మంది తమ జీవితాన్ని అయోమయం చేసుకున్నారు.

Woman Runs Away With Girl Due To Tiktok Effect-girl,kurnool News,tiktok,weird News,woman Telugu Viral News Woman Runs Away With Girl Due To Tiktok Effect-girl Kurnool News Tiktok Weird Woman-Woman Runs Away With Girl Due To Tiktok Effect-Girl Kurnool News Tiktok Weird

తాజాగా కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరు పిల్లల తల్లి కూడా టిక్‌టాక్ కారణంగా తన జీవితం నాశనం చేసుకుంది.

ఇక ఈ కథలోకి వెళితే.కర్నూలు జిల్లా ఆదోనిలోకి చెందిన అర్చన కొన్ని రోజులుగా టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటుంది.ఈ క్రమంలో బెంగుళూరుకు చెందిన అంజలి అనే యువతితో ఆమెకు పరిచయం ఏర్పడింది.

అంజలి మగాడి వేషంలో వీడియోలు చేస్తుండేది.దీంతో అర్చన ఆమెను మగాడు అనుకుని అంజలితో వీడియోలు చేసేది.

ఈ క్రమంలో వారి టిక్‌టాక్ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ఇంతటితో ఆగకుండా సదరు అర్చన తన భర్త, పిల్లలను వదిలి అంజలి కోసం బెంగుళూరుకు చెక్కేసింది.ఈ విషయం తెలుసుకున్న ఇంట్లో వారు ఆమెను వెతికి తిరిగి ఇంటికి చేర్చారు.ఒక మహిళ మరో యువతితో ప్రేమలో పడటం ఏమిటో అంటూ చుట్టుపక్కల వారు ముక్కున వేలేసుకుంటున్నారు.

తాజా వార్తలు