దారుణం : అత్తారింటి వేదింపులతో రోడ్డున పడ్డ మహిళను ఫొటోలు, వీడియోలు తీసిన జనాలు  

Woman Running On The Road And People Taking Photos-woman,అత్తింటి వారు,మహారాష్ట్ర,మానవత్వం

మానవత్వం ఎప్పుడో మంట కలిసి పోయింది. ఇప్పుడు జనాలు తర్వాత స్థితికి చేరుకుంటున్నారు. మానవత్వం అనేది ఒకటి ఉందనే విషయంను కూడా మర్చి పోతున్నారు..

దారుణం : అత్తారింటి వేదింపులతో రోడ్డున పడ్డ మహిళను ఫొటోలు, వీడియోలు తీసిన జనాలు-Woman Running On The Road And People Taking Photos

ఇతరులు ఎటు పోతే మనకు ఏంటీ, మనకు కావాల్సింది వినోదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్‌లు చేతిలోకి వచ్చిన తర్వాత మనం మనుషులం, మనకు కొన్ని పరిమితులు, పరుధులు ఉంటాయనే విషయాలనే మర్చి పోతున్నాం. అత్యంత దారుణమైన ఇలాంటి పరిస్థితులను మనం ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక చోట చూస్తూనే ఉన్నాం.

తాజాగా మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది.

చిరిగిన బట్టలు, ఊడిపోయిన జట్టుతోనే రోడ్డు మీద ఆమె పరిగెత్తింది. ఆమెకు సాయం చేయాలనే బుద్ది ఏ ఒక్కరికి కలగలేదు. సరే సాయం చేయకపోయిన పర్వాలేదు కాని రోడ్డు మీద వందలాది మంది ఆమె పరిగెడుతుంటే తమ తమ సెల్‌ ఫోన్‌లలో ఆమెను చిత్రీకరించడం మొదలు పెట్టారు.

ఒక మహిళ, అది కూడా ఆమె వేసుకున్న దస్తులు చిరిగి పోయి ఉన్నాయి. ఆమె ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. అలాంటి సమయంలో మానవత్వం ఉన్న వారు ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. కాని మానవత్వం అనేది మంట కలిసి పోయింది కనుక జనాలు అలాంటివి ఏమీ లేకపోవడంతో ఆమెను ఫొటోలు తీయడం మొదలు పెట్టారు.

అత్యంత నీచమైన బుద్ది ఉన్న ఆ జనాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం తప్ప మరేం చేయలేం. ఇది మరోస్థాయికి చేరితే పరిస్థితి ఏంటీ అనే విషయం తల్చుకుంటేనే ఒల్లు ముల్లెక్కుతోంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటో కదా..

!