చూస్తే షాక్ అవుతారు.... గుర్రంలా ఎంతదూరమైనా పరిగెడుతున్న మహిళ  

Woman Running Like Horse-

కాసేపు చిన్నారులను వీపు మీద ఎక్కించుకొని గుర్రం ఆట ఆడాలంటే నే నానా తిప్పలు పడుతూ ఉంటాం.అలాంటిది ఒక లేడీ ఎంత దూరం అయినా గుర్రం లా పరిగెట్టేస్తా అంటూ ఆమె చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.కాసేపు వంగి పనులు చేస్తే అమ్మే నడుం పట్టేసింది, అది ఇది అంటూ తెగ సణుగుతాం...

Woman Running Like Horse--Woman Running Like Horse-

కానీ నార్వే కు చెందిన అయ్లా కిర్‌స్టీన్ మాత్రం ఎంత దూరమైనా గుర్రం లా పరిగెత్తుతాను అంటూ ఈ నెల 14 న ట్విట్టర్ లో ఒక వీడియో పెట్టింది.అయితే ఆ వీడియో చూసిన నెటిజన్లు అందరూ నోరెళ్ళ బెట్టి ఆ వీడియో ని పలువురికి ఫార్వార్డ్ చేస్తున్నారు.దీనితో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.అయితే ఆమె పెట్టిన వీడియో లో ఒక్క గుర్రంలా పరిగెత్తడమే కాకుండా ఎత్తైన హర్డిల్స్‌ని కూడా ఎంచక్కా ఎక్కి దూకేస్తోంది.

Woman Running Like Horse--Woman Running Like Horse-

అయితే ఈ వీడియో ని చూసిన కొందరు ఆమె కు ఏదైనా సమస్య కారణంగా ఇలా ప్రవర్తిస్తుందేమో అని అనుకోని కూడా ఉండి ఉంటారు.అయినా ఆమె చిన్నప్పటి నుంచి ఈ రకంగా ప్రాక్టీస్ చేస్తుందో ఏమో కానీ ఆమెను చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోక మానరు.మొత్తానికి ఈ వీడియో ద్వారా కిర్ స్టీన్ మంచి ఫేమస్ అయిపొయింది.ప్రతి ఒక్కరూ కూడా ఆమె వీడియో ను చూసి లైక్స్ కొడుతున్నారు.

ఎవరి ట్యాలెంట్ వారికి ఉంటుంది, అందుకే ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరికీ వారు వారి వారి ట్యాలెంట్స్ ను చూపిస్తూ పలు వీడియో లను పోస్ట్ చేస్తున్నారు.కానీ కిర్ స్టీన్ ట్యాలెంట్ మాత్రం రొటీన్ కు భిన్నంగా ఉండడం తో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.