దేవుడా.. 10 అడుగుల పైథాన్‌ మహిళ కాలును చుట్టేసింది.. అయినా కానీ..?!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి అనేక రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్న మనం చూస్తూనే ఉన్నాం.అయితే ఇలాంటి వీడియో నే ఒకటి తాజాగా వైరల్ గా మారింది.

 Woman Rescued From 10ft Python Wrapped Around Her Leg, Python, Australia, Police-TeluguStop.com

భారీ పైథాన్‌ ఓ మహిళ కాళ్లను చుట్టేసిన వీడియో అది.ఆస్ట్రేలియా దేశంలో ఓ మహిళలకు పది అడుగుల పైథాన్‌ చుట్టుకోవడంతో దానిని విడిపించేందుకు పోలీస్ అధికారి పడిన తిప్పల గురించి ఉన్న ఈ వీడియో క్వీన్స్ ల్యాండ్ పోలీసులు తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక ఆ వీడియోను చూస్తే రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళకు పది అడుగుల పైథాన్‌ ఆమె కాళ్ళకు చుట్టేసుకుంది.ఆ మహిళ కుడి కాలుకు చుట్టుకున్న పైథాన్‌ ను వదిలించుకోవాల్సిన చిన్న ప్రయత్నం చేయకుండా ఆమె ఆ పైథాన్‌ తల నిమురుతూ ఉంది.

అయితే ఆ తర్వాత ఎంతసేపటికి ఆ పైథాన్‌ అలాగే చుట్టుకోవడంతో దానిని కదిలించేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ పోలీస్ అధికారి సహాయాన్ని కోరగా సదరు మహిళకు ఆ అధికారి వచ్చి సహాయం చేశాడు.

సదరు పోలీస్ ఆ మహిళకు పైథాన్‌ ను వదిలి చేందుకు సహాయం చేయడంతో పైథాన్‌ ఆమెను వదిలి వెళ్ళిపోయింది.ఆ సంఘటన తర్వాత అక్కడ మీడియాతో ఆ పోలీస్ అధికారి మాట్లాడుతూ.

ఎవరైనా పైథాన్‌ ను చూడగానే భయాందోళనలకు గురి అవుతారని అదే కాళ్లకు చూటేసుకుంటే సగం ప్రాణం అక్కడే పోతుంది.కాకపోతే, ఆ మహిళ మాత్రం అలా చేయకుండా ఆ పామును తన పెంపుడు జంతువుగా చూసింది అంటూ ఆశ్చర్యపోయాడు.

ప్రమాద పరిస్థితులలో కూడా ఆమె భయపడకుండా ధైర్యంగా వ్యవహరించిన సదరు మహిళ తీరుకు నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.ఆమె పై నెటిజన్స్ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube