66 నెలల క్రితం గర్బం దాల్చి.. ఇన్నాళ్లు ప్రసవ వేదన అనుభవించి ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది  

Woman Recreates Perfect Baby Photoshoot With Phd Thesis-ph.d In 66 Months,telugu Viral News Updates,vireal In Social Media,woman Recreates Perfect Baby

పుర్రెకో బుద్ది అని ఊరికే అనలేదు. ఒకొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. తమ భావాలను ఆలోచనలను పంచుకునేందుకు ఈమద్య కాలంలో జనాలు సోషల్‌ మీడియాను తెగ వాడేసుకుంటున్నారు..

66 నెలల క్రితం గర్బం దాల్చి.. ఇన్నాళ్లు ప్రసవ వేదన అనుభవించి ఇప్పుడు బిడ్డకు జన్మనిచ్చింది-Woman Recreates Perfect Baby Photoshoot With Phd Thesis

సోషల్‌ మీడియాలో వింత వింతగా పోస్ట్‌లు పెడుతూ తమను అందరు చూడాలని, తమకు మంచి పేరు రావాలని భావిస్తున్నారు. అందుకోసం చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు. అందులో కొందరు చేస్తున్న పనులు నవ్వు తెప్పిస్తుంటే మరి కొందరు చేసే పనులు ఏడుపు తెప్పిస్తాయి.

కాని తాజాగా సారి చేసిన సోషల్‌ మీడియా పోస్ట్‌ మాత్రం ఆమె కష్టంను చూపించింది.

గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఫొటోల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. జార్జియాకు చెందిన సారా వీలెన్‌ అనే యువతి తాజాగా ఒక సోషల్‌ మీడియా పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌లో ఫొటోలతో పాటు 66 నెలల గర్బం, ప్రసవ వేదన తర్వాత ఇప్పుడు నేను డెలవరీ అయ్యాను. నా కష్టంకు ప్రతిఫలం అన్నట్లుగా నాకు ఒక బిడ్డ జన్మించాడు.

ఆ బిడ్డను చూస్తుంటే నాకు సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ పోస్ట్‌ చేసింది..

ఇంతకు అసలు విషయం ఏంటీ అంటే. సారా గత అయిదున్న సంవత్సరాలుగా పీహెచ్‌డీ చేస్తోంది.

ఇక్కడైనా ఎక్కడైనా పీహెచ్‌డీ అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టపడి బుక్‌ రాయాల్సి ఉంటుంది. ఎంతో కష్టపడి తాను బుక్‌ రాశాను అని 66 నెలల కష్టంకు ఇది ప్రతిఫలం అన్నట్లుగా చెప్పేందుకు ఆమె గర్బంతో పోల్చింది. అంటే ఆమె పీహెచ్‌డీ సాధించేందుకు ఒక బిడ్డకు జన్మనిచ్చే తల్లి ఎంతగా అయితే కష్టపడుతుందో అంతకు మించి ఎక్కువగా కష్టపడ్డట్లుగా చెప్పుకొచ్చింది..

ఆమె క్రియేటివిటీకి జనాల మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. ఓవర్‌ నైట్‌లో ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.