యువతిపై 11 ఏళ్లుగా 143 మంది 5 వేల సార్లు అత్యాచారం... నల్గొండలో ఘోరం

సమాజంలో ఎంతో మంది ఆడవాళ్ళు మగాళ్ళ కామవాంచలకి బలైపోతున్నారు.ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళ మీద పైశాచిక దాడులు, అత్యాచారాలు ఇంకా ఎక్కువ అయిపోయాయి.

 Woman Raped 5 Thousand Times, Complaint Filed Against, Nalgonda, Women Harassmen-TeluguStop.com

ఓ వైపు ఇలాంటి ఘోరాలు చేస్తున్న వారికి శిక్షలు పడుతున్న మరో వైపు సమాజంలో ఆడవాళ్ళని సుఖాల బానిసలుగా మార్చి అత్యాచారాలు చేస్తూ ఉన్నవారు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నారు.అభం శుభం తెలియని బాలికల నుంచి వృద్ధుల వరకు ఎవరిని కూడా కామాంధులు వదలడం లేదు.

కొంత మంది ఆడవాళ్ళని అయితే భయపెట్టి, బెదిరించి సంవత్సరాల తరబడి వాళ్ళ కామవాంచలు తీర్చే బొమ్మలుగా వాడుకుంటున్నారు.సమాజంలో చాలా మంది బయటకి పెద్ద మనుషుల ముసుగు వేసుకొని లోపల ఇలాంటి పైశాచిక వ్యవహారాలు సాగిస్తున్నవారు ఉన్నారు.

తాజాగా నల్గొండ జిల్లాలో మరో ఘోరం వెలుగు చూసింది.

తనని బెదిరించి ఏకంగా 11 ఏళ్ళుగా ఇష్టానుసారంగా అత్యాచారానికి పాల్పడుతున్నారని ఓ యువతీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

తనను 143 మంది 11 ఏళ్ళుగా ఐదు వేల సార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది.కాలేజీ చదువుతున్న రోజులలో ఓ విద్యార్ధి నాయకుడు తనని ముందుగా బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని, తన వీడియోలు, ఫోటోలు తీసి తరువాత బెదిరింపులకి పాల్పడుతూ అతని ద్వారా చాలా మంది తనపై అత్యాచారం చేశారని తెలిపింది.

అందులో నటులు, యాంకర్లు, ప్రముఖుల పీఏలు కూడా ఉన్నారని తెలిపింది.తనపై అత్యాచారం చేసిన అందరి పేర్లు ఫిర్యాదులో రాసి పోలీసులకి కంప్లైంట్ చేసింది.ఆమె కంప్లైంట్ తీసుకున్న పోలీసులు 42 పీజీల ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు.తనని వేరే రాష్ట్రాలు కూడా తీసుకెళ్ళి మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడేవారని, అయిష్టంగానే వాళ్ళ బెదిరింపులకి భయపడి వారు చెప్పినట్లు వినేదానిని అని పోలీసులకి తెలియజేసింది.

ఇప్పుడు ఈ యువతి ఫిర్యాదు తెలంగాణలో సంచలనంగా మారింది.ఆమె కంప్లైంట్ ఇచ్చిన ఎవరిని పోలీసులు ఎవరిని బయటకి లాగుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube