అన్ని వదిలేసి ఎనిమిదేళ్లుగా సంచార జీవితం... మూత్రంతో తలంటూ, పచ్చి మాంసం భోజనం  

Woman Quit Modern Life To As A Nomad In Nz Wilderness-

పుర్రెకో బుద్ది అంటూ పెద్దలు ఊరికే అనలేదు.కొందరు గూడు, నీడ లేదు అంటూ ఏడుస్తుంటే కొందరు మాత్రం ఉన్న గూడును వదిలేసి అడవుల్లో బతికేస్తున్నారు.విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి అత్యంత దుర్బరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

Woman Quit Modern Life To As A Nomad In Nz Wilderness--Woman Quit Modern Life To Live As A Nomad In NZ Wilderness-

Woman Quit Modern Life To As A Nomad In Nz Wilderness--Woman Quit Modern Life To Live As A Nomad In NZ Wilderness-

పీహెచ్‌డీ చేసిన అతడు ఒక్క సెమినార్‌ ఇస్తే లక్షల్లో డబ్బులు వస్తాయి.ఆమె కూడా ఎంతో ఉన్నత చదువులు చదివి అత్యున్నత జాబ్‌లకు ఎంపిక అయ్యింది.

కాని వారిద్దరికి అవేవి సంతోషాన్ని ఇవ్వలేదు.వారిద్దరి అభిప్రాయాలు కలవడంతో సహజీవనం ప్రారంభించి దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా అడవుల్లో సంచార జీవితం సాగిస్తున్నారు.

కివికి చెందిన 64 ఏళ్ల మెట్‌ పీటర్‌ మరియు డచ్‌కు చెందిన 34 ఏళ్ల మిరియం ఒక సెమినార్‌ కోసం ఇండియాకు కొన్నాళ్ల క్రితం వచ్చారు.వారిద్దరి అభిప్రాయాలు ఒక్కటి అయ్యాయి.ఇద్దరు కూడా ఇండియా నుండి జంటగా వెళ్లారు.ఆ తర్వాత ఇద్దరు కూడా సహజీవనం సాగించారు.ఇద్దరికి కూడా ఏదో వెలితి.జీవితం అంటే ఇంతేనా, డబ్బు సంపాదిస్తే సరిపోతుందా, ఇంకా ఏం అక్కర్లేదా అనుకునేవారు.

వారిద్దరు కూడా కొత్త జీవితాన్ని అన్వేషిస్తూ వెళ్లాలనుకున్నారు.అనుకున్నదే తడువుగా 2012వ సంవత్సరంలో తమ ఇల్లు మరియు ఇతర ఆస్తులను ఒక ఏజెన్సీకి అప్పగించి సింపుల్‌ లగేజీతో రోడ్డు మీదకు నడిచారు.వారి ప్రయాణం ఎటువైపో అప్పుడు వారికి తెలియదు, ఇంకా కూడా వారి ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం సంచార జీవితం సాగించిన జంటగా ఈ జంటను చెబుతున్నారు.ఆస్తులను వదిలేసి రోడ్డున పడ్డ వీరు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు.అడవుల్లో సాదారణ జీవితాన్ని గడిపేస్తున్న వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో వారికే తెలియదు.

జలపాతాల వద్ద స్నానాలు చేస్తారు.జుట్టుకు మూత్రాన్ని షాంపుగా వాడుతారు.ఆ విషయాన్ని గురించి పీటర్‌ మాట్లాడుతూ మూత్రంను షాంపుగా వాడటం తమకు ఇబ్బంది ఏమీ లేదని, పైగా జుట్టుకు మూత్రం మంచి షాంపుగా ఉపయోగపడుతుందని అంటున్నాడు.

ఇక దారిలో కనిపించే చిన్న చిన్న జంతువులను చంపేసి వాటి మాంసాన్ని తినడం రోజు వారి అలవాటు.మంట అందుబాటులో ఉంటే ఆ మాంసాన్ని కాల్చుకోవడం లేదంటే పచ్చి మాంసాన్నే తినేడం వీరు చేసే పని.

ఇంత అవస్థలు, ఇన్ని ఇబ్బందులు ఎందుకు అంటే మేమేమి ఇబ్బంది పడటం లేదు, మేము కొత్త జీవితాన్ని వెదుకుతూ, హాయిగా జీవితాన్ని గడిపేస్తున్నాం అంటున్నారు.