లావు గురించి మాట్లాడిన మత గురువుకి ఓ బొద్దు సుందరి సన్మానం  

Woman Pushes Priest Off The Stage In Brazil-viral In Social Media,woman Pushes Priest,woman Pushes Priest Off The Stage

మత గురువులు బోధనలు చేస్తుంటే అందరూ కూడా చాలా శ్రద్దగా వింటూ ఉంటారు. వారు ఏది చెప్పిన తమ జీవితాలకు అన్వయించుకొని మరీ నిజమేనేమో అని అనుకుంటూ తెగ ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఒక మహిళ మాత్రం మత గురువు బోధనకు కోపానికి గురై ఏకంగా మత గురువుకి తనదైన శైలి లో సన్మానం చేసింది..

లావు గురించి మాట్లాడిన మత గురువుకి ఓ బొద్దు సుందరి సన్మానం -Woman Pushes Priest Off The Stage In Brazil

ఈ ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… బ్రెజిల్ రాజధాని సావో పాలో ఉన్న కచోయిరా పౌలిస్తా లో కొంతమంది మత గురువులు వచ్చి అక్కడ ప్రజల నుద్దేశించి బోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో లావుగా ఉన్న వాళ్లు స్వర్గానికి వెళ్లడానికి అనర్హులు అంటూ మార్కె లో రోసి అనే మతగురువు చెబుతున్న సమయంలో ఉన్నట్టుండి ఒక లావు పాటి మహిళ స్టేజ్ మీదకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గురువును ఒక్క తోపు తోసింది. అంతే గురువుగారు స్టేజ్ పై నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయారు.

ఆ తరువాత ఆమె కూడా కిందకు దూకేసింది.

అయితే ఈ ఘటనలో ఆ మతగురువుకు పెద్దగా గాయాలేం కాకపోవడం తో తిరిగి కొద్దీ సేపటికి తన ప్రసంగాన్ని ముగించుకున్నట్లు సమాచారం. మత గురువు బోధనలు అలా ఉంచితే ఆ మహిళ చేసిన ఈ పనికి సంబందించిన వీడియో మాత్రం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్స్ కూడా ఆమె చేసిన పనికి ప్రసంశలు కురిపిస్తున్నారు.

‘‘ఇదంతా దేవుడి చర్య’’.‘‘అతడు స్వర్గాన్ని సురక్షితంగా చేరుకున్నాడా..

?’’ . ‘‘ఆమె రియల్ హీరో’’. ‘‘అతడికిది కచ్ఛితమైన శిక్ష’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.