వైరల్ వీడియో: చంటి బిడ్డను ఎత్తుకుని డ్యూటీ చేస్తున్న మహిళ పోలీస్..!

మహిళలు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళు విధులు నిర్వహించే చోటుకు వారి పిల్లలను తమతో పాటు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడు తుంటాయి.తాజాగా ఒక మహిళ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ తన చంటి బిడ్డతో డ్యూటీ కి హాజరయ్యింది.

 Woman Police Constable In Chandigarh Doing Duty With Her Child , Lady Conistable-TeluguStop.com

ఆ మహిళ పోలీస్ కానిస్టేబుల్ రహదారి వద్ద ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది.ఆమెను చూసిన కొంత మంది విచారం వ్యక్తం చేయడంతోపాటు, పలు విమర్శలు చేస్తూ ఉన్నారు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.చండీగ‌ఢ్‌ లోని సెక్టార్ 15/23 లో ప్రియాంక అనే మహిళ పోలీస్ కానిస్టేబుల్ తన చంటి బిడ్డను ఎత్తుకుని దుమ్ములో , రహదారిపై డ్యూటీ నిర్వహిస్తూ ఉండగా గమనించిన కొంత మంది వీడియో తీసి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియో చుసిన కొంత మంది నెటిజన్స్ ఆమెకు ఫీల్డ్ డ్యూటీ వేసిన పోలీసు ఉన్నతాధికారి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.ఆమెకు ఎదైన డెస్క్ జాబ్ కేటాయించి ఉండాల్సిందని, అంతేకాకుండా ఆమె బిడ్డకు ఉచితంగా క్రెచ్ లేదా డే కేర్ సదుపాయాన్ని కల్పించాల్సిందిగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ సంఘటనపై అక్క‌డి డీజీపీ సంజ‌య్ బ‌నివ‌ల్ స్పందిస్తూ.బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం గడిచిన నెల కిందట ఆమె విధులకు హాజరు అయిందని తెలిపాడు.

ఆమె ఉదయం ఎనిమిది గంటలకే డ్యూటీ లో రిపోర్ట్ చేయాల్సి ఉండగా, ఆలస్యంగా కావడంతో వెంటనే డ్యూటీకి చేసే ప్రాంతానికి వెళ్లిందని తెలియజేశారు.ఈ క్రమంలో డెస్క్ జాబ్ కావాలి అనుకుంటే.

 రిక్వెస్ట్ పెట్టుకుంటే  చాలు ఆమెను ఆ జాబ్ కు మారుస్తామని తెలిపారు.అలాగే ఆ మహిళా పోలీస్ కానిస్టేబుల్ కు చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఉన్నాయని వీలైతే వాటిని వినియోగించుకోవచ్చు అని డీజీపీ సంజ‌య్ తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube