ఆదర్శం : రెండు చేతులు లేకున్నా ఆమె విమానం నడుపుతోంది, ఎలా సాధ్యమో మీరే చూడండి  

Woman Pilot With No Hands-without Arms,అంగవైకల్యం,జెస్సిక సక్సెస్‌ స్టోరీ,విమానం

రెండు చేతులు, రెండు కాళ్లు ఉన్న వారు కూడా కొందరు కనీసం ఏ పని చేసేందుకు ఆసక్తి చూపించరు. అన్ని ఉన్నా కూడా సత్తా లేక పోవడంతో జీవితాన్ని భారంగా గడుపుతూ ఉంటారు. కాని కొందరు మాత్రం అంగవైకల్యం ఉన్నా కూడా అద్బుతమైన కృషితో పట్టుదలతో అద్బుతాలు ఆవిష్కరిస్తారు...

ఆదర్శం : రెండు చేతులు లేకున్నా ఆమె విమానం నడుపుతోంది, ఎలా సాధ్యమో మీరే చూడండి-Woman Pilot With No Hands

అంగవైకల్యం తమ ప్రతిభ ముందు దిగదుడుపే అనిపించుకుంటారు. అమెరికాకు చెందిన జెస్సికా ఒక వండర్‌ కిడ్‌. ఆమె పుట్టినప్పటి నుండే రెండు చేతులు లేవు.

ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు తమ పాప ఒక అద్బుతం అనే విషయాన్ని గుర్తించి ఉండరు. కాని ఇప్పుడు జెస్సిక అంటే ఒక సంచలనం.

జెస్సిక సక్సెస్‌ స్టోరీ పూర్తి వివరాల్లోకి వెళ్తే…రెండు చేతులు లేని జెస్సిక ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. తన రెండు కాళ్లే చేతులుగా మార్చుకుంది.

రెండు చేతులతో ఎలాంటి పనులు అయితే మనం చేయగలమో అలాగే జెస్సిక తన కాళ్లతో పూర్తిగా పనులు చేసుకోగలదు. వ్యక్తిగత పనుల వరకు అయితే ఓకే. కాని ఆమె ఒక శాస్త్రవేత్తగా మారింది.

కృత్రిమ చేతులు మొదట ధరించినా కూడా కొంత కాలంకే వాటిని తొలగించింది. ఆ తర్వాత 22 ఏళ్ల వయసులో పైలెట్‌గా శిక్షణ పొందింది. ఆమెకు మొదట శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించినా కూడా ఆమె పట్టుదలతో ప్రయత్నించి అవకాశం దక్కించుకుంది.

కేవలం మూడు సంవత్సరాల్లో పైలెట్‌గా పూర్తి నిష్ణాతురాలు అయ్యింది. పైలెట్‌గా చిన్నా పెద్ద విమానాలను ఆమె నడుపుతోంది.

అమెరికాలోని ఆరిజోనాకు చెందిన జెస్సిక ప్రపంచంలోనే అతి విభిన్నమైనమహిళగా గుర్తింపు దక్కించుకుంది. రెండు చేతులు లేని పైలెట్‌గా రికార్డు దక్కించుకుంది. రెండు చేతులు రెండు కాళ్లు ఉన్నా కూడా విమానం నడపడం అంటే చాలా కఠినమైన విషయం...

అలాంటిది కేవలం కాళ్లతో విమానంను నడుపుతున్న ఆమెను ఎంతగా అభినందించినా కూడా తక్కువే. జెస్సినా ఈతరం యువతకు చాలా ఆదర్శం. ఆమె ఒక గొప్ప ధైర్యశాలి.

చేతులు లేకుండానే అద్బుతాలు ఆవిష్కరించిన ఆమెకు హ్యాట్సాప్‌ చెప్పాల్సిందే.