స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా భారత సంతతి మహిళ

స్కాట్లాండ్ చరిత్రలో భారత సంతతి మహిళ చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.ఆ దేశ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అవడంతో ఇప్పుడు ఆమె పేరు మారు మోగుతోంది.

 Woman Of Indian Descent As A Member Of Parliament For Scotland, Woman Leader Bus-TeluguStop.com

అయితే వివిధ దేశాలలో ఎంతో మంది భారతీయులు ఉన్నారు.అందరూ రాజకీయ, ఇతరాత్రా రంగాలలో చెరగని ముద్ర వేస్తున్నారు కదా మరి ఆమె సృష్టించిన రికార్డ్ ఏంటి అనే ఆలోచన రాకమానదు.

ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏమిటంటే.స్కాట్లాండ్ చరిత్రలో ఇప్పటి వరకూ భారత సంతతి వ్యక్తీ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికక కావడం ఇదే ప్రప్రధమట.

వివరాలలోకి వెళ్తే.

ఆమె పేరు పామ్ గోసల్.

భారత సంతతి మూలాలు ఉన్న మహిళ పుట్టింది, పెరిగింది స్కాట్లాండ్ లోనే.ఆమె ప్రస్తుతం వెస్ట్ స్కాట్లాండ్ నుంచీ కన్జర్వేటివ్ పార్టీ తరుపున పార్లమెంట్ కు ఎంపిక అయ్యారు.

స్కాట్లాండ్ యూకే రెండు దేశాలలోని ప్రభుత్వ, ప్రవైటు రంగాలలో ఆర్ధిక, వ్యాపారం, తదితర కీలక శాఖలలో సుమారు 30ఏళ్ళుగా పనిచేసిన అనుభవం ఉంది.అయితే ఆమె 2019 లోనే ఈస్ట్ డెన్బార్గ్ నుంచీ పార్లమెంట్ అభ్యర్ధిగా పోటీ చేశారు.

ఆమె ఎంపిక పట్ల ప్రవాస భారతీయులు, సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.ఈ విజయం పై స్పందించిన పామ్ గోసల్.

వెస్ట్ స్కాట్లాండ్ ప్రజలందరికీ ధన్యవాదాలు.మీకు సేవచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.మీకు సేవ చేయడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని ప్రకటించారు.ఎంబీఏ పూర్తీ చేసిన గోసల్ పలు రంగాలలో పనిచేశారు.2015 లో ఉమెన్ లీడర్ బిజినెస్ అవార్డ్ అందుకున్న గోసల్ 2018 లో పబ్లిక్ సర్వీస్ అవార్డ్ కుడా దక్కించుకున్నారు.ప్రస్తుతానికి ఆమె ఉమెన్స్ కన్జర్వేటివ్ సంస్థలో డిప్యుటీ ఛైర్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube