యూపీలో మరో నిర్భయ ఘటన..!  

Woman Moving Bus Up - Telugu Moving Bus, Uttar Pradesh, Woman Gang Rape, Woman Raped In Moving Bus In Up

భారతదేశంలో కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్రం ఐదుసార్లు లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ విధితమే.ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న లాక్ డౌన్ లో అనేక వాటికి సడలింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Woman Moving Bus Up

అయితే ఈ సడలింపుల నేపథ్యంలో దేశంలో మహిళలపై మళ్లీ అఘాయిత్యాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.దేశంలో రోజుకి ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు మగవారు ఎగబడుతున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోతున్నాయి.ప్రతి సంవత్సరం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

యూపీలో మరో నిర్భయ ఘటన..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న చివరికి ఇలాంటి ఘటనలు మాత్రం పునరావృతం అవుతూనే ఉన్నాయి.ఇకపోతే తొమ్మిది సంవత్సరాల క్రితం దేశరాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి బస్సులో అమ్మాయి నిర్భయపై జరిగిన అత్యాచారం ఇప్పటికి ఎవరు మర్చిపోయారు.

ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.అది కూడా కదులుతున్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.ఓ ఇద్దరు బస్సు డ్రైవర్లు కలిసి సదరు యువతిపై అత్యాచారానికి తెగబడ్డారు.ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే….

ప్రతాప్ ఘడ్ నుంచి నోయిడాకు వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సులో ఓ 25 సంవత్సరాలు గల యువతి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ప్రయాణించడానికి బస్సు ఎక్కింది.అయితే ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఆ మహిళపై కన్నేశారు ఆ దుర్మార్గులు.

ఇకవారు అనుకున్న పథకం ప్రకారం బస్సు డ్రైవర్లు సదరు యువతిని వెనుక ఉన్న చివరి సీట్లలో కూర్చోమని చెప్పారు.ఆ తర్వాత తన పిల్లలని చంపుతామని బెదిరించిన కదులుతున్న బస్సులోనే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు ఆ బస్సు డ్రైవర్లు.

ఈ సంఘటన ముగిసిన తర్వాత ఆమె తన భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో నిందితులపై పోలీసులు ఐపిసి సెక్షన్ 306, 506 కింద కేసు నమోదు చేసి పోలీసులు నిందితులలో ఒకరైన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

అలాగే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test