హైదరాబాదులో దారుణం.. మహిళకు లిఫ్ట్ ఇచ్చి కారులో అత్యాచారం..!

ఇటీవలే కాలంలో ఎంతోమంది కామాంధులు మంచితనం నటించి అమాయక మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.ముఖ్యంగా బయట ఒంటరిగా ప్రయాణాలు చేస్తున్న మహిళలు అవతల వ్యక్తుల నమ్మకపు మాటలు విని వారి చేతులలో అత్యంత దారుణంగా అత్యాచారాలకు గురవుతున్నారు.

 Woman Molested In Car After Giving Lift In Hyderabad Details, Woman Molested , C-TeluguStop.com

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చిన.ఎన్ని కఠిన శిక్షలు విధించిన సమాజంలో మార్పు అనేది లేదు.

తాజాగా హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఓ యువతి అత్యాచారానికి గురైంది.సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే.హైదరాబాద్ మధుర నగర్ పరిధిలో ఓ మహిళ వర్షంలో నడుచుకుంటూ వెళుతూ ఉండగా.ఓ కారు డ్రైవర్( Car Driver ) కారు ఆపి ఎక్కడికి వెళ్లాలో చెబితే లిఫ్ట్ ఇస్తానని చెప్పాడు.మొదట ఆ మహిళ ఎటువంటి లిఫ్ట్ వద్దు అని ముందుకు నడుచుకుంటూ వెళ్ళింది.

అయితే వర్షం కాస్త పెరగడంతో మళ్లీ ఆ కార్ డ్రైవర్ కాస్త ముందుకు వెళ్లి కారు ఆపి వర్షం ఎక్కువ అవుతోంది తడిచి పోతారు అంటూ మంచి వాడిలాగా కాస్త కలరింగ్ ఇచ్చాడు.

Telugu Car, Hyderabad, Madhura Nagar-Latest News - Telugu

దీంతో ఆ మహిళ అతని నమ్మి కారు ఎక్కేందుకు అంగీకరించి వెనుకల సీట్లో కూర్చునేందుకు వెళ్లగా పర్వాలేదు ముందు సీట్లోనే కూర్చోండి అని డోర్ తెరిచాడు.ఆ మహిళ కారు ఎక్కిన తర్వాత మధ్యలో ఒక చిన్న పని ఉంది అది చూసుకొని వెళ్దామని చెప్పి ఓ నిర్జీవ ప్రదేశానికి( Vacant Place ) తీసుకువెళ్లాడు.ఆ మహిళ ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఎన్నిసార్లు అడిగినా ఆ డ్రైవర్ సమాధానం ఇవ్వలేదు.

డ్రైవర్ ప్రవర్తన చూసి కాస్త భయపడిన మహిళ అరవడం మొదలు పెడితే చంపేస్తానని డ్రైవర్ బెదిరించాడు.

Telugu Car, Hyderabad, Madhura Nagar-Latest News - Telugu

ఆ తర్వాత ఆ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.అనంతరం ఆ మహిళను కారులో నుంచి బయటకు తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.ఆ మహిళను దయనీయ స్థితిలో చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ ప్రాంతంలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube