రైలెక్కడానికే వచ్చావా? మరి ఇలాంటి పనులేంటిరా నీచంగా.? చివరికి వీడియో తీసిన అతను కూడా.!  

స‌మాజంలో క్రూర మృగాలు పెరిగిపోయాయి. వాటికి అడ్డు, అదుపూ ఉండ‌డం లేదు. మ‌హిళ‌లు క‌న‌బ‌డితే చాలు రెచ్చిపోతున్నాయి. వారిపై అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నాయి. వాటికి క‌న్నూ మిన్నూ క‌నిపించ‌దు. వావి, వ‌రుస, చిన్న‌, పెద్ద అనే తేడాలు ఉండ‌వు. పాశ‌వికంగా దాడి చేయ‌డ‌మే ప‌ని. వీధులు, బస్లాండ్లు, రైల్వే స్టేషన్లు, గుళ్లుగోపురాలు.. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా నీచాలకు పాల్పడుతున్నారు. ఓ రైల్వే స్టేషన్ లో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ నీచుడి దుశ్చర్య కెమెరాకు చిక్కింది. వీడియో చూస్తే వాడిని తిట్టకుండా ఉండలేరు. కేరళలోని కొచ్చి రైల్వే స్టేషన్లో వారం కిందట ఈ వేధింపులు సాగాయి.

మొదట కుర్చీలో తన పక్కన కూర్చున్న మహిళ నడుంపై చేతులు వేశాడు. మహానటుడిలా పోజులు కొడుతూ కీచకానికి తెగబడ్డాడు. తర్వాత తన ముందు కుర్చీలో కూర్చున్న మహిళ వీపు కింద చేతిపెట్టి నీచపైత్యాన్ని ప్రదర్శించాడు. అంతకు ముందు కూడా అతడు టికెట్ బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీసాకుతో పలువురు మహిళలను అసభ్యంగా తాడు. ఈ చేష్టలను ఓ వ్యక్తి అదేపనిగా సెల్ ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు.

ఈ నేపథ్యంలో వీడియోలు తీసిన వ్యక్తిపైనా విమర్శలు వస్తున్నాయి. ఈ కీచకుణ్ని అడ్డుకోకుండా నాలుగు వీడియోలు తీస్తూ నువ్వు కూడా ఎంజాయ్ చేశావా అని నెటిజన్లు తిడుతున్నారు.నిజమే కదా అండి. అడ్డుకోకుండా అతను ఏం చేస్తున్నాడు.