ఈ మధ్య కొంత మంది వింత వింత చేష్టలతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.ఒకర్ని చూసి మరొకరు వింత వింత పనులను చేస్తున్నారు.
తాజాగా ఒక మహిళ చేసిన కూడా ఇలాగె వింత పని చేయడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయ్యింది. పెళ్లి అంటే ఇష్టమైన అమ్మాయి తనకు ఇష్టమైన అబ్బాయితో జరుపుకునే అపురూపమైన వేడుక.
కానీ ఈ మధ్య వింత వింత పెళ్లిళ్లు జరుగుతున్నాయి.
తాజాగా అమెరికాకు చెందిన ఒక యువతి తనని తానే అద్దంలో చూసుకుని ముద్దు పెట్టుకుని పెళ్లి చేసుకుంది.
ఎందుకంటే ఆ యువతి ప్రేమించిన అబ్బాయి తనకు బ్రేక్ అప్ చెప్పడంతో ఇలాంటి పని చేసానని ఆ యువతి చెబుతుంది.బ్రేక్ అప్ చెప్పడానికి ముందే ఆ యువతి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుందట.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఆ యువతీ పేరు మెగ్ టేలర్.ఆమె అమెరికాకు చెందినది.ఆ యువతి టేలర్ అనే వ్యక్తిని ప్రేమించింది.
ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు.కానీ ఈ లోగానే అతడు ఈ యువతికి బ్రేక్ అప్ చెప్పాడు.
కానీ మెగ్ టేలర్ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది.తన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని అనుకుంది.
ఆ సమయంలో ఆమెకు ఒక ఐడియా రావడంతో వెంటనే దాన్ని అమలు చేసింది.
తనని తానే పెళ్లి చేసుకోవాలని అనుకుంది.
పెళ్లి కొడుకు లేకుండానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని స్నేహితులను, బంధువులను పిలిచింది.పెళ్ళికి కావలసిన అన్ని పనులను పూర్తి చేసుకుంది.
పెళ్లిరోజు పెళ్లి కూతురు దుస్తుల్లో అందంగా తయారయ్యి పెళ్లి ఉంగరం తన వేలుకి తొడుక్కుంది.అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ముద్దు పెట్టుకుని ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.