బియ్యం, రాగి పిండి మిశ్రమంతో టీ కప్పులు తయారు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న టీచర్!

ఆలోచన చేయాలేగాని సంపాదనకు ఇపుడు అనేక మార్గాలు.అది తెలియకే నేటి సమాజంలో ఎంతోమంది రోజుకూలీలుగా మిగిలిపోతున్నారు.

 Woman Makes Edible Tea Cups Using Ragi Rice Flour Entrepreneur Earns Lakhs,edib-TeluguStop.com

కాస్త చదువు, ఇంకాస్త సృజనాత్మకత తోడైతే ఎలాంటి విజయాలైనా సాధించవచ్చు.అవును, సాధారణంగా మనం ఎక్కడైనా బయటికి వెళ్లినప్పుడు టీ, కాఫీ తాగిన తరువాత కప్పును చెత్తకుప్పలో పడేస్తాం.

ఇక మనం బయట తాగే కప్పులు దాదాపుగా ప్లాస్టీక్ లేదంటే పేపర్ తో చేసిన కప్పులై ఉంటాయి.అయితే మనం కాఫీ, టీ తగిన తరువాత ఆ కప్పును బయట పడేయకుండా ఏంచక్కా తినేస్తే ఎలా ఉంటుంది? ఇదేదో బాగుంది కదా.ఇలాంటి ఐడియానే వచ్చింది ఆమెకు.

Telugu Cups, Eco Friendly, Edible Tea Cups, Edile Tea Cup, Latest, Vizag-Latest

వివరాల్లోకి వెళితే, APలోని వైజాగ్ జిల్లాలో రేసపువనిపాలెం అనే గ్రామంలో నివసిస్తున్న జయలక్ష్మి ఓ టీచర్.లాక్ డౌన్ తరువాత ఆమె తన టీచర్ జాబ్ ని వదిలి, ఎంట్రీప్రెన్యూర్ గా మారింది.ముందుగా ఆమెకి కప్పుల బిజినెస్ పెడుదామనే ఐడియా వచ్చింది.

దాంతో ఆమె ఒక చిన్న కప్పులు తయారు చేసే కంపెనీని నెలకొల్పింది.ఈ క్రమంలో మార్కెట్లో దొరికే కప్పులకంటే మంచి కప్పులు, ఆరోగ్యానికి అనుకూలమైన కప్పులు తయారు చేయాలని ఆలోచన చేసింది జయలక్ష్మి.

అనుకున్నదే తడవుగా దాని కోసం దాదాపు రెండు నెలలు కష్టపడి మంచి ఫార్ములాను తయారు చేసి ఇప్పుడు ఎడిబుల్ టీ కప్పులను తయారు చేస్తోంది.

Telugu Cups, Eco Friendly, Edible Tea Cups, Edile Tea Cup, Latest, Vizag-Latest

ఆ కప్పులు తయారు చేయడం ద్వారా ఆమె సంవత్సరానికి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సంపాదిస్తోంది అంటే మీరు నమ్ముతారా? అది కూడా ఆమె యూట్యూబ్ లో వీడియోలను చూసే ఎడిబుల్ కప్స్ ను ఎలా తయారు చేయాలో నేర్చుకోవడం విశేషం.కరోనా కారణంగా టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయిన ఆమె నేడు ఓ పదిమందికి ఉద్యోగావకాశాలను కల్పించడం విశేషం.అందుకే జీవితంలో ఎదగాలంటే వినూత్నంగా, ఉన్నతంగా ఆలోచన చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube