యూట్యూబ్ వీడియో లైక్ చేసింది.. 24 లక్షలు పోగొట్టుకుంది.. ఎలా అంటే?

సోషల్ మీడియాలో కొత్త జాబ్ స్కామ్( Job Scam ) హల్చల్ చేస్తోంది.ఈ స్కామ్‌లో స్కామర్లు ఈజీ పార్ట్‌టైమ్ జాబ్, ఎక్స్‌ట్రా మనీ కోసం డబ్బును పెట్టుబడి పెట్టేలా ప్రజలను మోసగిస్తున్నారు.

 Woman Loses 24 Lakh After She Liked A Youtube Video Online Part Time Job Scam De-TeluguStop.com

ఇటీవలి నెలల్లో ఇటువంటి కేసులు అనేకం నమోదయ్యాయి.భారతదేశంలోని పూణేలో,( Pune ) వైరల్ పార్ట్ టైమ్ జాబ్ స్కామ్‌లో పడి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు మొత్తం రూ.33 లక్షలు కోల్పోయారు.ఒక కేసులో యూట్యూబ్ వీడియోలను( Youtube Videos ) లైక్ చేయడం వంటి ఆన్‌లైన్ టాస్క్‌లు చేసినందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని నమ్మ బలుకుతూ ఒక మహిళ నుంచి సైబర్ నేరగాళ్లు రూ.23.83 లక్షలను నొక్కేసారు.

బాధితురాలు తన మెసేజింగ్ యాప్‌లోని మెసేజ్ ద్వారా స్కామ్‌లో చిక్కుకుంది.స్కామర్లు మొదట యూట్యూబ్ వీడియో లైక్ చేయడం వంటి చిన్న టాస్కులు ఇస్తూ బాధితురాలి నమ్మకాన్ని పొందారు.

ఆపై క్రిప్టోకరెన్సీ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడి పెడితే ఆమెకు మరింత ఆదాయాన్ని అందిస్తామని చెప్పారు.మరింత సులభంగా నగదు సంపాదించాలనే ఆశతో, ఆ మహిళ డబ్బును డిపాజిట్ చేయడానికి అంగీకరించింది.

Telugu Cryptocurrency, Schemes, Job Scam, Liked Youtube, Fraud, Time Job Scam, T

స్కామర్లు ఆమెకు పనులను ఆఫర్ చేస్తున్నప్పుడు రెండు బ్యాంకు ఖాతాలకు రూ.23.83 లక్షలు బదిలీ చేసింది.బాధితురాలు తన క్రిప్టోకరెన్సీ ( Cryptocurrency ) పెట్టుబడిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె చెల్లింపును తిరిగి ఇవ్వడానికి స్కామర్లు ఆమె నుంచి అదనంగా రూ.30 లక్షలు డిమాండ్ చేశారు.అయితే, ఆమె చెల్లించడానికి నిరాకరించింది.

స్కామర్లు ముఖం తిప్పేసారు.ఆమె ఆన్‌లైన్ స్కామ్‌ వలలో పడిపోయినట్లు తరువాత గ్రహించింది.

Telugu Cryptocurrency, Schemes, Job Scam, Liked Youtube, Fraud, Time Job Scam, T

ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ జాబ్ స్కామ్‌ల బారిన పడకుండా ఉండేందుకు, వ్యక్తులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ముందు కంపెనీని పరిశోధించాలి, వారి గట్ ఫీలింగ్‌ను విశ్వసించాలి, వ్యక్తిగత సమాచారాన్ని అందించడంలో జాగ్రత్త వహించాలి.కంపెనీకి సంబంధించిన ఫిర్యాదుల కోసం ఆన్‌లైన్ ఫోరమ్‌లు, రివ్యూ సైట్‌లను తనిఖీ చేయాలి.నిజమైన యజమానులు ఉద్యోగం పొందడానికి డబ్బు పంపమని మిమ్మల్ని ఎప్పటికీ అడగరు.మీరు అసలైన కంపెనీ యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారని నిర్ధారించుకోవడానికి మీరు లింక్డ్‌ఇన్, ఇండీడ్, గ్లాస్‌డోర్ వంటి పాపులర్ ఉద్యోగ ఇంజన్‌లను ఉపయోగించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube