మూడేళ్లకుపైగా కారులోనే జీవనం.. ఎందుకంటే?

అద్దె అనగానే సామాన్య జనాలు, పేదలు హడలిపోతుంటారు.నెల నెలా కట్టే అద్దె అంటే జడుసుకుంటారు.

 Woman Lives In Car For 3 Years Who Dont Like To Pay Rent , Girl Living Three Years, Latest News, Viral News , Woman Live In Car-TeluguStop.com

సంపాదనలో సగం అద్దెకే చెల్లించేవారు చాలా మందే ఉంటారు.ఈ సమస్య అక్కడ ఇక్కడా అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది.

సొంతిల్లు లేని వారు అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తుంటారు.చిన్న స్థలంలో అయినా ఇల్లు కట్టుకుని ఉండాలని అనుకుంటారు చాలా మంది.

ఆపాటి స్థలం కూడా లేని వారు ట్రక్కులు, వ్యాన్లు, కార్లను ఆవాసాలుగా చేసుకుని బతికేస్తున్నారు.ఈ ధోరణి పాశ్చాత్య దేశాల్లో పెరిగిపోయింది.

వేలకు వేలు పెట్టి అద్దె ఇళ్లలో ఉండటం కంటే.ఒక్కసారి ఏదైనా వ్యాన్ కొనుక్కొని దానిని అన్ని రకాలుగా మాడిఫై చేసేస్తే.

సొంత వాహనంలో ఎన్ని రోజులు అయినా ఉండవచ్చు కదా అని అనుకుంటున్నారు.

ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు నికిత క్రంప్.ఉండేది అమెరికాలో.2019 నుండి హోండా సివిక్ కారులోనే జీవిస్తోంది.అయితే ఇలా జీవించే వారు చాలా మందే ఉంటారు.ప్రత్యేకంగా నికిత క్రంప్ గురించి ఎందుకు చెప్పుకోవడం అంటే.ఆమె జీవించే కారులో ఎలాంటి సదుపాయాలూ లేవు.కిచెన్, బెడ్, బాత్రూం అలాంటి లేకుండానే మూడేళ్లకు పైగా అందులోనే ఉంటోంది నికిత క్రంప్.

మరెలా ఉంటుంది అనే డౌట్ వచ్చే ఉంటుంది.అలాంటి ప్రశ్నలకు ఇన్ స్టాగ్రామా వేదికగా సమాధానాలు చెబుతోంది నికిత క్రంప్.ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 1.21 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు.టిక్ టాక్ లో 10 లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.రోజూ తన లైఫ్ ఎలా సాగుతుంది అనేది అందులో పోస్టు చేస్తుంటుంది.ఫాలోయర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.అంతకు ముందు ఆమె అద్దె ఇంట్లో ఉండేది.

రెండు ఉద్యోగాలు చేసినా అద్దె చెల్లించడం చాలా కష్టంగా ఉండేది.ఒక్కోసారి ఖాళీ కడుపుతోనే నిద్రపోయేది.

అలా చాలా కష్టాలు పడ్డ తర్వాత కారులో జీవించాలన్న ఆలోచన వచ్చింది నికిత క్రంప్ కు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube