షాకింగ్..మూఢ నమ్మకంతో 11 ఏళ్ల కూతురును ప్రమాదంలో పడేసిన తల్లి!

టెక్నాలజీ ఎంత పెరుగుతున్న ఇంకా మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు అంటూ నమ్మకాలూ పెట్టుకుని చాలా మంది వారితో పాటు వారి పక్కన ఉన్న వారిని కూడా ప్రమాదంలో పడేస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఎన్ని వెలుగు చుసిన కూడా వారిలో మూఢ నమ్మకాలూ మాత్రం తొలగి పోవడం లేదు.

 Woman Let ‘god Take The Wheel’ As Test Of Faith In High-speed Ohio Crash, Ca-TeluguStop.com

దేవుడిని నమ్మడం తప్పుకాదు.కానీ మనం ఎలాంటి పనులు చేసినా దేవుడు మనల్ని కాపాడుతాడని గుడ్డిగా చేస్తూ పోకూడదు.

తాజాగా ఒక మహిళ దేవుడి మీద ఉన్న నమ్మకంతో తన 11 ఏళ్ల కూతురు ను కూడా ప్రమాదంలో పడేసింది.మూఢ నమ్మకం కారణంగా తనతో పాటు తన కూతురు ప్రాణాలతో కూడా ఆ తల్లి చెలగాటం ఆడుకుంది.

ఈ సంఘటన అమెరికాలో జరిగింది.అమెరికాలోని ఓహియా రాష్ట్రంలో ఒక కారు ప్రమాదం సంభవించింది.

ఈ కారు రోడ్డు ప్రమాదం అని ముందుగా పోలీసులు అనుకున్నారు.

Telugu Car, Godwheel, God Wheel-Latest News - Telugu

కానీ పోలీసులు విచారించగా అసలు విషయం తెలిసింది.ఇది రోడ్డు ప్రమాదం కాదు.కావాలనే ఇలా చేసింది అని.ఈ కారు ప్రమాదం జరుగుతున్నా సమయంలో 190 కిలో మీటర్ల స్పీడుతో దూసుకు పోతుంది.అంత వేగంగా ప్రయాణించే తప్పుడు ఎవరైనా కారు స్టీరింగ్ వదిలి పెట్టి డ్రైవింగ్ చేస్తారా.

అది కూడా కావాలని.కానీ ఒక మహిళ మాత్రం అలా చేసింది.

కావాలనే స్టీరింగ్ వదిలేసింది.

దాంతో ఈ ప్రమాదం జరిగింది.పోలీసులు విచారించగా.ఆ మహిళ కావాలనే చేసానని చెప్పింది.దీంతో పోలీసులు అలా ఎందుకు చేసావ్ అని ప్రశ్నించగా.నాకు దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడని.

డ్రైవింగ్ చేసే సమయంలో దేవుడు కాపాడుతాడో లేదో టెస్ట్ చేశా అని ఆమె చెప్పింది.ఇది విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు.

అలా చేసే సమయంలో ఆ కారులో ఆమెతో పాటు తన కూతురు కూడా ఉంది.తన మూఢ నమ్మకంతో తనతో పాటు తన 11 ఏళ్ల కూతురు కూడా ప్రమాదంలో పడింది.

ప్రస్తుతం వారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఆమెకు బాగానే ఉన్న.

కూతురు కు మాత్రం తలకు బలంగా తగలడంతో చికిత్స పొందుతుంది.ఏంటో మూఢ నమ్మకంతో ప్రాణాలనే రిస్క్ లో పెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube