వైరల్ ఫోటో: కుక్క బొచ్చుతో ఉంగరాల జుట్టు.. మహిళ విన్నూత్న ఆలోచన!

మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. జీవితంలో మనం చదువు ద్వారా సక్సెస్ సాధించలేకపోయినా ఆ ప్రతిభే మనం ఉన్నత స్థానాల్లో నిలిచేలా చేస్తుంది.

 Woman Leaves Netizens Baffled By Weaving Pieces Of Her Dogs Hair Into Her Dreadl-TeluguStop.com

తమ టాలెంట్ తో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు.కొందరు తమకు మాత్రమే సొంతమైన ప్రతిభతో కోట్లు గడిస్తున్నారు.

సోషల్ మీడియా వినియోగం విసృతంగా పెరిగిన నేపథ్యంలో తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ తమ ప్రతిభకు తగిన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.

తాజాగా ఒక మహిళ పెట్ డాగ్ ద్వారా తన ప్రతిభను ప్రదర్శించింది.

పెట్ డాగ్ సహాయంతో తనలో ఉన్న కళా నైపుణ్యాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది.మన దేశంలో మహిళల జుట్టు నిటారుగా ఉన్న ఆఫ్రికా దేశానికి చెందిన జుట్టు మాత్రం రింగులు తిరిగి ఉంగరాల జుట్టులా ఉంటుంది.

చాలా మందికి ఆ హెయిర్ స్టైల్ నచ్చడంతో తమకు ఆ హెయిర్ స్టైల్ ఉండేలా కొంతమంది ప్రయత్నం చేస్తారు.

కొందరు ఎంత ప్రయత్నించినా అలాంటి ఉంగరాల జుట్టును పొందడం సాధ్యం కాదు.

దీంతో అలాంటి వాళ్లు విగ్ పై ఆధారపడాల్సి వస్తోంది.అయితే అలాంటి విగ్ లను తయారు చేయడం, అందుబాటులో ఉన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయడం సాధ్యం కాదు.

అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలని ఆలోచించి హెయిర్ స్టైలిస్ట్ క్రిస్సా రాజ్ జీ కుక్క వెంట్రుకలతో జుట్టును తయారు చేసింది.

డ్రీడ్ లాక్ హెయిర్ స్టైల్ పేరుతో క్రిస్సా రాజ్ జీ తయారు చేసిన జుట్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఒక పోస్ట్ ద్వారా కుక్క వెంట్రుకలను జుట్టుకు ఎలా వేసిందో ఆమె వివరించింది.క్రిస్పా జుట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆమె తెలివిని మెచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube