ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. తండ్రిని ఎలా చంపారో చెప్పిన 5 యేళ్ల బాలుడు.. కంటతడి పెట్టుకుంటారు

అక్రమ సంబంధ మోజులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా కొందరు కట్టుకున్న వారిని చంపేస్తూ ఉంటారు.ఆ తర్వాత న్యాపరమైన చిక్కులు ఉంటాయని, ఖచ్చితంగా విషయం బయటకు తెలుస్తుందని అనిపించినా కూడా ఆ మత్తులో ప్రియుడు లేదా ప్రియురాలి మోజుతో కట్టుకున్న వారిని చంపేందుకు సిద్దం అవుతున్నారు.

 Woman Kills Husband With Lovers Help-TeluguStop.com

మద్య ఒక మహిళ తన భర్తను చంపి, ఆ స్థానంలో ప్రియుడిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన విషయం తెల్సిందే.ఇంకా ఎన్నో అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

తాజాగా కర్ణాటకలో జరిగిన దారుణం సభ్య సమాజం నోరు వెళ్లబెట్టేలా ఉంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.రాజలింగంకు సోనియాకు ఆరు సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది.పెళ్లి అయినప్పటి నుండి కూడా భర్తతో సోనియా సరిగా ఉండేది కాదు.కలహాల కాపురంతోనే వీరికి ఇద్దరు కొడుకులు జన్మించారు.కొడుకులు పుట్టిన తర్వాత కూడా సోనియాకు భర్త రాజలింగంపై ప్రేమ కలుగలేదు.

ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉంది.కొన్ని వారాల క్రితం రాజలింగంకు సోనియా అక్రమ సంబంధం గురించి తెలిసింది.

సోనియాను తీవ్రంగా మందలించిన రాజలింగం ఇప్పటి నుండైనా మంచిగా ఉండాని గడ్డి పెట్టాడు.కొన్ని రోజుల వరకు సోనియా కామ్‌గా ఉంది.తాజాగా ప్రియుడిని కలిసి రాజలింగంకు మన విషయం తెలిసిందని, ఇకపై కలవడం కష్టం అంటూ చెప్పింది.మనం కలవాలంటే తన భర్తను చంపేయాలని సూచించింది.అందుకు ఓకే చెప్పిన ఆమె ప్రియుడు రాజలింగంను చంపేందుకు ఒప్పుకున్నాడు.

సోనియా ప్రియుడు శనివారం రాత్రి రాజలింగం ఇంటికి స్నేహితులతో కలిసి వచ్చాడు.

ఆ సమయంలో ఇంట్లో రాజలింగం లేడు.రాజలింగం వచ్చే సమయానికి చాటుగా దాసుకుని బిగ్గరగా పట్టుకుని విషపు సూది వేసి అతడిని చంపేశారు.

ఆ తర్వాత ఉరి వేసుకున్నట్లుగా నమ్మించేందుకు ప్రయత్నించారు.ఆ తర్వాత బయటకు వెళ్లి సోనియా జనాలను ఏడుస్తూ పిలిచింది.

దాంతో జనాలు వచ్చారు, పోలీసులు వచ్చారు.

పోలీసులు ఆత్మహత్యగా కేసు నమోదు చేసినా, విచారణలో హత్య అని వెళ్లడయ్యింది.అది హత్య అని చెప్పింది మరెవ్వరో కాదు రాజలింగం పెద్ద కొడుకు.అవును, అయిదు సంవత్సరాల రాజలింగం పెద్ద కొడుకు తన తండ్రిని తల్లి మరియు మరో ముగ్గురు ఎలా చంపారో కళ్లకు కట్టినట్లుగా చెప్పాడు.

ఆ కుర్రాడు చెప్పిన దాని ప్రకారం సోనియాను కాస్త సీరియస్‌గా విచారించడంతో అసలు విషయం చెప్పింది.హత్యలో పాల్గొన్న ప్రియుడు మరియు ఇతరులను గాలించే పనిలో పోలీసులు ఉన్నారు.

ఈ సంఘటన స్థానికంగా పెద్ద సంచలనం అయ్యింది.సోనియాను తీవ్రంగా దూషిస్తూ కొట్టేందుకు కూడా ప్రయత్నించారు.

అక్రమ సంబంధంతో ఇద్దరు పసికందులు అనాధలయ్యారు.ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube