54 రోజులు మేనేజ్ చేసిన మహిళ.. ఒక్క చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయింది..

అత్యంత బలంగా ఉండే భారతీయ వివాహ బంధం వివాహేతర సంభంధాల కారణంగా బలహీనంగా మారుతున్నాయి.రోజురోజుకూ పరాయి వ్యక్తులపై వ్యామోహంతో భార్య భర్తను, లేదంటే భర్త భార్యను వదిలేయడానికి కూడా సిద్ధ పడుతున్నారు.

 Woman Kills Hubby With Help Of Lover-TeluguStop.com

భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రావడం వల్ల వాళ్ళ మధ్య గొడవలు మొదలవుతాయి.ఈ గొడవల కారణంగా ఒకరిని మరొకరు చంపుకోవడానికి కూడా వెనుకాడడం లేదు.

అలాంటి ఘటనే తాజాగా అనంతపురం జిల్లాలో జరిగింది.భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉండకుండా మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.అక్కడితో ఆగకుండా ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా చంపేసింది.తర్వాత మృతదేహాన్ని కూడా మాయం చేసి ఏమి ఎరుగనట్లుగా భర్త కనపడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 Woman Kills Hubby With Help Of Lover-54 రోజులు మేనేజ్ చేసిన మహిళ.. ఒక్క చిన్న తప్పుతో అడ్డంగా దొరికిపోయింది..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.అయితే సరిగ్గా 54 రోజుల తర్వాత ఆమె చేసిన చిన్న తప్పు కారణంగా పోలీసులకు అడ్డంగా దొరికి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.అనంతపురం కదిరి పట్టణంలో నాగభూషణం అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు.అతడు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అతని భార్య ఈశ్వరమ్మ.

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఈ మధ్య ఈశ్వరమ్మకు ఒక వ్యక్తితో పరిచయం అయింది.

ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీయడంతో ఆమె తన భర్త అడ్డుగా ఉన్నాడని అతడ్ని చంపాలని నిర్ణయించుకుని అనుకున్నట్లుగానే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.చంపేసిన తర్వాత మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చి పెట్టింది.

Telugu Ananthapuram, Crime News, Eswaramma, Husband Kill Wife, Illegal Affairs, Kadiri, Lover, Naga Bhushanam-Latest News - Telugu

తర్వాత ఏమి తెలియనట్లు తన భర్త ఎక్కడికో వెళ్లాడని చుట్టుపక్కల వారితో చెప్పి కన్నీరు పెట్టుకుంది.అంతేకాదు భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.సరిగ్గా 54 రోజుల తర్వాత ఆమె బండారం మొత్తం బయట పడింది.రెండు రోజుల క్రితం ముదిగుబ్బలో గుర్తు తెలియని శవం బయట పడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు ఈశ్వరమ్మను మృతదేహాన్ని గుర్తుపడ్తాడానికి పిలిచారు.అక్కడకు వచ్చిన ఆమె అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమె కాల్ డేటాను పరిశీలించి భర్త మరణానికి ఈమె కారణమని నిర్దారించుకుని విచారించగా ఈశ్వరమ్మ నిజం ఒప్పుకుంది.

పోలీసులు ఆమెను తీసుకువెళ్లి భర్తను పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని గుర్తించారు.ఈశ్వరమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

#Kadiri #Ananthapuram #Naga Bhushanam #Lover #Illegal Affairs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు