భ‌ర్త‌ను చంపి మంచంలో దాచేసిన భార్య.. చివరకు?  

woman kills hasband hides body at home for a day before informing cops in rajasthan state, Rajasthan, Niraja, Nirmal Singh, Sucide, Hamirwas Subash Chandra, Police Station, - Telugu Brutal Murder, Neeraja, Nirmal Singh, Rajastan Woman

రాజస్థాన్ రాష్ట్రంలోని చురూ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న విషయాలకే వివాదాలు తలెత్తుతుండటంతో భార్య భర్తను చంపేయాలని ప్రణాళిక రచించింది.

TeluguStop.com - Woman Kills Hasband Hides Body At Home For A Day Before Informing Cops In Rajasthan State

అనుకున్నదే తడవుగా భార్య భర్తను దారుణంగా హత్య చేసింది.అయితే హత్య చేసిన తరువాత శవాన్ని ఎక్కడ దాచాలో అర్థం కాకపోవడంతో మహిళ పోలీసులకు లొంగిపోయింది.

పూర్తి వివరాళ్లోకి వెళితే చురూ జిల్లాలోని హ‌‌మిర్వాస్‌ లో నీర‌జ(28), నిర్మ‌ల్ సింగ్(34) కలిసి జీవనం సాగించేవారు.వీరికి ఇద్దరు సంతానం.నీరజ, నిర్మల్ లకు చాలా సంవత్సరాల క్రితమే పెళ్లైనా తరచూ ఏదో ఒక విషయంలో వాదనలు జరుగుతూ ఉండేవి.పలు సందర్భాల్లో ఇరుగుపొరుగు వాళ్లు నీరజ, నిర్మల్ లకు గొడవలు పడవద్దని సూచించినా వాళ్లు మాత్రం గట్టిగా అరుస్తూ గొడవ పడేవాళ్లు.

TeluguStop.com - భ‌ర్త‌ను చంపి మంచంలో దాచేసిన భార్య.. చివరకు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఒకరి ఆలోచనలకు మరొకరు భిన్నంగా వ్యవహరిస్తుండటం, ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించకపోవడం ప్రధానంగా గొడవలకు కారణమయ్యేది.

అయితే తరచూ జరుగుతున్న గొడవలను నిర్మల భరించలేకపోయింది.

ముందుకు అనుకున్న ప్లాన్ ప్రకారం భర్తను హత్య చేసి మంచంలో దాచిపెట్టింది.అయితే మంచం నుంచి దుర్వాసన వస్తుండటంతో నీరజకు ఏం చేయాలో అర్థం కాలేదు.

ఇల్లంతా దుర్వాసనతో నిండిపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతుండటం గమనించి పోలీసులకు అసలు విషయాన్ని చెప్పింది.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

నిర్మల్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ హ‌మిర్వాస్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ కేసు దర్యాప్తు చేస్తున్నామని.

హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాలని అన్నారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నిర్మ‌ల్ కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

నిర్మల్ మృతితో అతని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.నీరజను కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.

ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

#Neeraja #Rajastan Woman #Nirmal Singh #Brutal Murder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Woman Kills Hasband Hides Body At Home For A Day Before Informing Cops In Rajasthan State Related Telugu News,Photos/Pics,Images..