అక్రమ సంబంధం పెట్టుకున్న వదిన.. దాంతో మరిది...- Woman Killed Her Husband For Extra Marital Affair In Hyderabad

woman killed her husband for extra marital affair in Hyderabad, Hyderabad, Crime news, Telangana, extra marital affair news, Women Murder - Telugu Crime News, Extra Marital Affair News, Hyderabad, Telangana, Woman Killed Her Husband For Extra Marital Affair In Hyderabad, Women Murder

ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురం చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.తాజాగా ఓ వివాహిత తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉంటున్న యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి తన ప్రియుడితో కలిసి భర్తని అంతమొందించి, ఎవరికీ అనుమానం రాకుండా తన భర్త ది సాధారణ మరణమని నమ్మించే ప్రయత్నం చేసి పోలీసులకు చిక్కిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది.

 Woman Killed Her Husband For Extra Marital Affair In Hyderabad-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగర పట్టణ పరిధిలోని పంజాగుట్ట ప్రాంతంలో “కుష్బూ” అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.అయితే గత కొద్ది కాలంగా ఖుష్బూ స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

 దీంతో తన భర్త ఇంట్లో లేని సమయంలో కుష్బూ మరియు తన ప్రియుడు ఏకాంతంగా కలుసుకునే వారు.ఇటీవలే ఈ విషయం గురించి ఖుష్బూ భర్తకి తెలియడంతో పలుమార్లు ఆమెను మందలించాడు.

 Woman Killed Her Husband For Extra Marital Affair In Hyderabad-అక్రమ సంబంధం పెట్టుకున్న వదిన.. దాంతో మరిది…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేగాక వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రాజేస్థాయిని కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సర్ది చెప్పినప్పటికీ కుష్బూ మాత్రం అతడి మాటలను పెడ చెవిన పెట్టింది.దీంతో మరోమారు ఈ విషయంపై భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరగడంతో తన ప్రియుడి సహాయంతో కుష్బూ తన భర్తని హత్య చేసింది.

అలాగే తన భర్త కి హార్ట్ ఎటాక్ ఉందని అందువల్లే చనిపోయాడని అందరిని నమ్మించింది.అయితే అంత్యక్రియలకు వచ్చినటువంటి కుష్బూ మరిది మాత్రం తన అన్నయ్య చావు సాధారణం కాదనే సందేహం రావడంతో వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి అసలు విషయాన్ని కనుగొన్నారు. దీంతో మృతుడి భార్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తామే తన భర్తను చంపినట్ల కుష్బూ నేరం అంగీకరించిదట.

#Telangana #Hyderabad #Women Murder #ExtraMarital #WomanKilled

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు