రూ. 2000 కోసం పట్టాలపై దూకింది, అదే సమయంలో రైలు వచ్చింది, కాని..!  

Woman Jumps On Metro Tracks To Fetch Money-

రైల్వే ఫ్లాట్‌ ఫాంపై ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.కాని కొందరు మాత్రం చాలా అజాగ్రత్తతో ఉంటారు.రైలు వస్తున్న సమయంలో కూడా ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నిస్తారు.అలాంటి వారు ఏదో ఒక సమయంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

Woman Jumps On Metro Tracks To Fetch Money- Telugu Viral News Woman Jumps On Metro Tracks To Fetch Money--Woman Jumps On Metro Tracks To Fetch Money-

ఇప్పటికే రైల్వే స్టేషన్‌లో రైలు వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండక పోతే ఎలాంటి ప్రమాదాలు జరిగాయో మనం అనేక సందర్బాల్లో చూశాం.తాజాగా మరోసారి అదే ప్రమాదం జరిగింది.

అయితే ఈసారి ప్రాణం పోకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.ఈసారి రెండు వేల రూపాయల ఆ ప్రమాదాన్ని ఒక మహిళ కొని తెచ్చుకుంది.

Woman Jumps On Metro Tracks To Fetch Money- Telugu Viral News Woman Jumps On Metro Tracks To Fetch Money--Woman Jumps On Metro Tracks To Fetch Money-

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీలోని ద్వారక మోర్‌ మెట్రో రైల్వే స్టేషన్‌కు ఒక మహిళ చేరుకుంది.ఆ మహిళ రైలు కోసం ఎదురు చూస్తు తన బ్యాగ్‌లో నుండి ఏదో తీసేందుకు ప్రయత్నించింది.

ఆ సమయంలోనే బ్యాగ్‌లో ఉన్న రెండు వేల రూపాయల నోటు జారి ట్రాక్‌ మీద పడింది.ఆ సమయంలోనే కాస్త దూరంగా ట్రైన్‌ వస్తుంది.ట్రైన్‌ వచ్చే లోపు నోటు తీసుకోవచ్చని భావించింది.తీసుకోకుంటే అది తనకు దక్కదు అనుకుందో లేదా మరేంటో కాని అందరు వారిస్తున్నా కూడా ఆమె వెంటనే ట్రాక్‌పైకి దూకింది.

ఆ నోటును అందుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే ట్రైన్‌ వచ్చేసింది.దాంతో ఎక్కలేక అక్కడే చిన్న సందులో నిల్చుండి పోయింది.

ప్లాట్‌ ఫాంకు రైలుకు మద్యలో ఉన్న చిన్న సందులో ప్రాణాలు బిగబట్టి ఆమె నిల్చుంది.అంతా కూడా ఆమె చనిపోయిందని భావించారు.

అయితే రైలు వెళ్లి పోయిన తర్వాత ఆమె చిన్న చిన్న గాయాలతో బయట పడింది.దాంతో వెంటనే ఆమెను రైల్వే పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు.

స్టేషన్‌లో ఉన్న వందలాది మందిని అల్లాడించిన ఆమె ప్రాణాలతో మిగలండంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.రెండు వేల రూపాయల కోసం ఇంత పిచ్చి పని చేయడం ఏంటీ అంటూ అంతా కూడా ఆమెను తిట్టి పోశారు.

రెండు వేల కోసం ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.అదృష్టం బాగుండి బయట పడింది.

.

తాజా వార్తలు

Woman Jumps On Metro Tracks To Fetch Money- Related....