వీడియో: క్యాచ్ పడతారని నమ్మి ఇంటి పైనుంచి దూకిన యువతి.. మిస్ కావడంతో లబోదిబో..

జీవితంలో ఎవరినీ ఎప్పుడూ గుడ్డిగా నమ్మేయకూడదు.మన జాగ్రత్తల్లో మనం ఉండటం చాలా ముఖ్యం.

 Woman Jumped From Top Of The House Missed To Catch Video Viral Details, Viral Vi-TeluguStop.com

లేదంటే చివరికి బలి కావడం ఖాయం.తాజాగా ఈ విషయాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకుంది ఓ యువతి.

యువతి( Woman ) కనీసం 15 అడుగుల ఎత్తులో ఉన్న ఒక ఇంటి పైకప్పు( Rooftop ) అంచున నిల్చని కింద క్యాచ్ పట్టే వారి చేతుల్లోకి దూకాలని అనుకుంది.కానీ వారు ఆమెను క్యాచ్ పట్టడంలో మిస్ అయ్యారు.

అంతే ఆమె కింద పడిపోయింది.ఆ సమయంలో నడుము భాగానికి బాగా దెబ్బ తగిలింది.

ఆ దెబ్బ తగలగానే యువతి అల్లాడిపోయింది.గట్టిగా ఏడ్చేసింది.

చూస్తుంటే ఆమెకు చాలా నొప్పి కలిగినట్లు తెలుస్తోంది.

ఈ వీడియోను ఎక్స్‌ ప్లాట్‌ఫామ్ లో సీసీటీవీ ఇడియట్స్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే నాలుగు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే టీ షర్ట్, ఐ గ్లాస్సెస్ ధరించిన ఒక యువతి ఇంటి రూఫ్‌పై నిలబడటం చూడవచ్చు.

కింద ఇద్దరు ఆమెను క్యాచ్ పట్టడానికి( Catch ) చేతులు ఒకరికొకరు పట్టుకొని ఉన్నారు.దూకుతున్నా అని సైగ చేసి ఆ యువతి దూకేసింది.అయితే వారు ఆ యువతి పడుతున్న ప్లేస్‌లో చేతులు ఉంచలేదు.దాంతో సదరు అమ్మాయి వారి చేతిలో నుంచి జారిపోయి ముందుకు పడిపోయింది.

దానివల్ల బాగా దెబ్బ తగిలింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా నవ్వుకుంటున్నారు.మరికొందరు ఆ వ్యక్తులు యువతిని క్యాచ్‌ చేసేంత స్ట్రాంగ్ గా లేరు, ఒకవేళ పట్టుకుని ఉంటే వారికి గాయాలు అయ్యుండేమో అని అన్నారు.ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదని ఇంకొందరు హితబోధ చేశారు.

మొత్తం మీద ఈ వీడియో ఒక సేఫ్టీ రిమైండర్ గా మిగిలిపోయింది.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube