తాబేలు గూడుపై చిందులేసిన మహిళ..కేసు నమోదు!  

Woman Jabbed At Miami Beach Sea Turtle Nest With Stick-viral In Social Media,woman Jabbed At Miami Beach

జంతువులను హింసించడం నేరం,పాపం అంటూ పలు దేశాలు వాటి సంరక్షణ విషయం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే చైనా కు చెందిన ఒక 41 ఎల్లా యాకన్ అనే మహిళ పై రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి తాబేళ్లకు హాని కలిగించడం, రెండు తాబేళ్ల గుడ్లు నాశనం చెయ్యడం..

తాబేలు గూడుపై చిందులేసిన మహిళ..కేసు నమోదు!-Woman Jabbed At Miami Beach Sea Turtle Nest With Stick

అమెరికా మిచిగాన్‌లోని తన అడ్రెస్‌ని వాళ్లకు ఇచ్చిన ఆమె… త్వరలోనే కోర్టు నోటీసులు అందుకోబోతోందట. 1973 నాటి ఫ్లోరిడా అరుదైన అంతరించిపోయే జీవుల చట్టం ప్రకారం తాబేళ్లను ముట్టుకోవడం, హాని చెయ్యడం, గుడ్లను టచ్ చెయ్యడం, నాశనం చెయ్యడం వంటివి నేరం కింద లెక్క. ఈ క్రమంలోనే మియామీ బీచ్‌లో లాగ్గర్ హెడ్, గ్రీన్, లెదర్ బ్యాక్ జాతి తాబేళ్లు జీవిస్తున్నాయి. అవి ఏప్రిల్ నుంచీ నవంబర్ వరకూ గూళ్లు కట్టుకుంటాయి.

41 ఏళ్ల యాకన్ మియామీ బీచ్‌లో తాబేలు నిర్మించుకున్న గూటిని సర్వ నాశనం చేసిందని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా తాబేళ్లు గూళ్లు కట్టుకోవు. గుడ్లు పెట్టే ముందే అవి గొయ్యి తవ్వుకుంటాయి. అయితే అలా గొయ్యి తవ్వుకున్న ప్లేస్ లోనే ఆ మహిళ వెళ్లి వెళ్లి ఆ గొయ్యిపైనే బీచ్ అందాలను చూస్తూ చిందులు వేయడం తో ఆ గొయ్యి కాస్తా పూడుకుపోయింది.

అయితే ఈమె చేసిన ఈ తతంగం అంతా కూడా ఒక జంతు ప్రేమికుడి కళ్లలో పడడం తో నేరుగా విషయాన్నీ పోలీసులకు చేరవేశాడు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు యాకన్ పై రెండు కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఇక అటువైపు పర్యాటకులు ఎవరూ రాకుండా ఎల్లో టేప్స్ పెట్టి డు నాట్ డిస్టర్బ్ సీ టర్టిల్ అంటూ బోర్డు కూడా పెట్టారట.