బిడ్డ ఏడుస్తుందని నోటికి గమ్ పెట్టిన తల్లి... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?  

Woman In Bihar Applies Glue On Son\'s Lips To Stop Him From Crying-

చంటి పిల్లలకు ఆకలి వేసినా, నొప్పి కలిగినా మరే ఇబ్బంది అనిపించినా కూడా కేవలం వారు ఏడుపుతోనే తమ ఫీలింగ్స్‌ను చెప్పలేరు.వారు ఏడిచిన సమయంలో వారికి కావాల్సినది ఇస్తే ఆటలో పడిపోతారు.అబంశుభం తెలియని పిల్లలు ఏడుస్తున్నారు అంటే వారికి ఏదో ఇబ్బంది ఉందని మనం గుర్తించాలి...

Woman In Bihar Applies Glue On Son\'s Lips To Stop Him From Crying--Woman In Bihar Applies Glue On Son's Lips To Stop Him From Crying-

అంతే తప్ప వారి ఇబ్బందిని అర్థం చేసుకోకుండా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు అంటూ అసహనం వ్యక్తం చేయడం లాంటివి అస్సలే చేయవద్దు.ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు ఏడుస్తుంటే వారి ఏడుపు ఆపేందుకు ప్రయత్నించాలి కాని, ఏడుపు ఆపేందుకు నోరు మూయవద్దు.కాని ఇటీవల బీహార్‌లోని ఒక మహిళ తన చంటి బాబు గుక్కపట్టి ఒక్కటే ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకోలేక దారుణానికి ఒడి గట్టింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…

బీహార్‌ రాష్ట్రం ఛాప్రా అనే జిల్లాకు చెందిన శోభ అనే మహిళ తన చిన్నారి బాబు ఏడుస్తూ ఉంటే పదే పదే విసుక్కుంది.పాలు పట్టించినా, బొమ్మలు ఇచ్చినా కూడా పాపాయి ఏడుస్తూనే ఉంది.దాంతో శోభకు విసుగు వచ్చి ఆ బాబు నోటికి గమ్‌ పెట్టింది.దాంతో ఆ పాప ఏడుపు బయటకు వినపడకుండా అయ్యింది.

Woman In Bihar Applies Glue On Son\'s Lips To Stop Him From Crying--Woman In Bihar Applies Glue On Son's Lips To Stop Him From Crying-

అదే సమయంలో శోభ భర్త వచ్చాడు.పాప పెదాలు మూసుకుని ఉండటం గమనించిన అతడు వెంటనే శోభను ప్రశ్నించగా జరిగింది చెప్పింది.దాంతో అవాక్కయిన భర్త వెంటనే భార్యను మందలించి బాబును హాస్పిటల్‌కు తరలించారు.

హాస్పిటల్‌లో వైధ్యులు ఆ బాబుకు ఇబ్బంది లేకుండా గమ్‌ను తొలగించడంతో పాటు, ఆ బాబుకు అజీర్ణ సమస్యకు సంబంధించిన మందులు ఇవ్వడం జరిగింది.దాంతో ఆ బాబు ఏడుపు ఆపేసాడు .ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్యం బాగుందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందని వైధ్యులు చెప్పారు.ఆ తల్లి మాత్రం తాను చేసింది తప్పే కాదని, బాబు ఒకటే ఏడుస్తుంటే తనకు అంతకు మించిన మార్గం కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చింది.

పోలీసు కేసు నమోదు చేయాలని భావించినా స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేసి కేసు నమోదు కాకుండా చూశారు.